యాపిల్ ఫోన్ లకు మార్కెట్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.యువత ఎక్కువగా యాపిల్ ఫోన్లను( Apple iPhones ) కొనడానికే అధిక ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో యాపిల్ ఐఫోన్ 15ల( Apple iPhone 15 ) హవా నడుస్తోంది.అయితే కొద్ది రోజులుగా త్వరలోనే ఐఫోన్ 16( iPhone 16 ) మార్కెట్లోకి విడుదల అవ్వనుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
యాపిల్ ఐఫోన్ 16 మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియదు కానీ అప్పుడే ఐఫోన్ 16 కు సంబంధించిన ఎన్నో ఫీచర్లతో వివరాలు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి.ఐఫోన్ 16 కు సంబంధించి లీక్ అయిన సూపర్ ఫీచర్స్ ఏమిటో తెలుసుకుందాం.
యాపిల్ ఐఫోన్ 16 ఏకంగా 6.12 అంగుళాల డిస్ ప్లే తో వస్తుందట.యాపిల్ ఐఫోన్ 16 ప్లస్ 6.69 అంగుళాల డిస్ ప్లే తో వస్తుందట.ఐఫోన్ 16 మోడల్ లలో LTPS 60HZ అనే టెక్నాలజీని ఉపయోగించారు.ఐఫోన్ 16 ప్రో బ్యాటరీ ప్రోటో లైఫ్ ఫోటోలు లీక్ అయ్యాయి.తుషార మెటాలిక్ షెల్, బ్యాటరీ పరిమాణం ముందున్న వెర్షన్ కన్నా 2.5 శాతం పెద్దగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఐఫోన్ 16 సైజు సాధారణ ఐఫోన్ 15 మోడల్ ల మాదిరిగానే ఉంటాయని, ఫోన్ లోపల మాత్రం కొన్ని సరికొత్త మార్పులతో వస్తుందని సమచారం.థర్మల్ మేనేజ్మెంట్ కు సంబంధించి, ఐఫోన్ 16 మోడల్ లు గ్రాఫేన్ హీట్ సింక్ లను( Graphine Heat Sink ) కలిగి ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి.ఈ హీట్ సింక్ లు ఉష్ణ వాహాకత ఫీచర్ల ను కలిగి ఉంటాయి.దీనితో ఫోన్ లో హీటింగ్ సమస్య అనేది ఉండదు.మొత్తానికి ఐఫోన్ 15 కు ఐఫోన్ 16కు మధ్య కాస్త ఎక్కువగానే ఫీచర్ల విషయంలో వ్యత్యాసం ఉంటుందని తెలుస్తోంది.ఈ ఐఫోన్ 16 లాంచింగ్ డేట్ ను త్వరలోనే ప్రకటించేందుకు కంపెనీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తున్నట్లు సమాచారం.