కరీంనగర్ జిల్లాలోని చేగుర్తి, నల్లగుంటపల్లిలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది.ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థిది నేరచరిత్రని, తనది అభివృద్ధి, పోరాటాల చరిత్రని తెలిపారు.
భూ కబ్జా, బ్లాక్ మెయిల్, చీటింగ్ కేసులు పురమళ్ల సొంతం అని బండి సంజయ్ ఆరోపించారు.మరోవైపు ఇసుక రీచ్ తో మంత్రి గంగుల కమలాకర్ వందల కోట్లు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.
కేసీఆర్ ఇంటిలో పదవులు ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు.ఈ క్రమంలోనే తాను భూకబ్జాలు, అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.
తనపై దొంగ వీడియోలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.గంగులకు ధైర్యముంటే అవినీతి, అభివృద్ధి, ఆస్తులపై చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు.