Chandrababu Lokesh : చంద్రబాబుమాటలకు కలత చెందిన లోకేశ్.. అలా ఎలాఅంటారని ప్రశ్న!

టీడీపీలో యువతరం నాయకత్వంలోకి వెళ్ళనుంది.ఈ ఎన్నికల్లో పలువురు కీలక నేతలు వారసులను రంగంలోకి దింపనున్నారు.

 Lokeshfires On His Fathers Last Chance , Lokesh , Chandrababu ,tdp , Ap News-TeluguStop.com

అలాగే చంద్రబాబు కూడా తన వారసత్వంమైన లోకేష్‌కు పూర్తి పార్టీ బాధ్యతలను అప్పజెప్పిందుకు ప్రయత్నిస్తున్నాడు.అయితే పార్టీలో నమ్మకం కోల్పోయిన  లోకేష్‌పై తండ్రి చంద్రబాబుతో సహా ఎవరికీ ఆయనపై నమ్మకం లేకుండా పోయింది.

 లోకేశ్‌ నాయకత్వంలో నడవడం కేడర్‌కు ఇష్టం లేకుండా ఉంది. లోకేశ్‌ని కాదని జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరును పార్టీ కార్యకర్తలు చాలాసార్లు బలపరచారు.

 తాజాగా చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటన ఈ భావాన్ని నిజం చేసింది. టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ఇదే చివరి అవకాశం అని అన్నారు.

ఈ విషయంపై లోకేశ్, చంద్రబాబు కొంత చర్చ జరిగినట్టు తెలుస్తుంది. పార్టీ అంతర్గత వివరాల ప్రకారం తనను పూర్తిగా విస్మరించారని చంద్రబాబు నాయుడుపై లోకేష్ కాస్త ఫైర్ అయినట్లు తెలుస్దుంది2004లో ఓడిపోయిన మనం పదేళ్లలో అధికారంలోకి రాలేదా? ‘చివరి అవకాశం’ అనే పదబంధాన్ని ఎందుకు ఉపయోగించాలి? పైగా నేను ఇంకా పార్టీలో ఉన్నాను” అని లోకేష్ సిబిఎన్‌ని ప్రశ్నించినట్లు ఇన్‌సైడ్ న్యూస్.

Telugu Ap, Chandrababu, Ntr, Lokesh-Political

2024లో పార్టీ ఓడిపోతే టీడీపీ అంతం అని తన తండ్రి మాటలతో లోకేష్ పూర్తిగా కలత చెందారు. చంద్రబాబు ఎమోషనల్ గేమ్ ఆడేందుకు ప్రయత్నించినా అది బూమరాంగ్ అయింది. రాష్ట్ర రక్షించు వాడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే క్రమంలో తన కుమారుడి రాజకీయ ప్రతిష్టను దూరం చేసుకున్నారు. సిబిఎన్‌ తన సెల్ఫ్ సెంట్రిక్ స్టేట్‌మెంట్స్‌తో లోకేష్‌లోని చైతన్యాన్ని చంపేస్తున్నాడని టీడీపీ వర్గాలు అంటున్నాయి.2024 ఎలాగైన గెలవాలని చంద్రబాబు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రస్తుతం జిల్లా పర్యటననలో బిజీగాా ఉన్నారు.

త్వరలో లోకేష్ పాదయాత్ర మెుదలుపెట్టనున్నారు.ఈ సమయంలో చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పాదయాత్రపై ప్రభావం చూపుతుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube