ఒక మంచి తల్లికి పుడితే భోళాపై బ్యాడ్ కామెంట్స్ రాయరు.. లోబో షాకింగ్ కామెంట్స్!

భోళా శంకర్ సినిమా ప్రస్తుతం సోషల్ మీడియా ట్రోల్స్ ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.బుక్ మై షో వెబ్ సైట్ లో సైతం ఈ సినిమా బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు.

 Lobo Shocking Comments About Netizens Negative Comments Details Here Goes Vira-TeluguStop.com

ఇండిపెండెన్స్ డే సెలవును సైతం ఈ సినిమా క్యాష్ చేసుకునే అవకాశాలు కనిపించడం లేదు.మెహర్ రమేష్ మరోసారి శక్తిని చూపించాడంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనర్హం.

అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన లోబో( Lobo ) నెగిటివ్ రివ్యూల గురించి, నెగిటివ్ కామెంట్ల గురించి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఒక మంచి తల్లికి పుడితే భోళా శంకర్ మూవీపై బ్యాడ్ కామెంట్స్ రాయరని లోబో చెప్పుకొచ్చారు.

సోషల్ మీడియాలో సినిమా గురించి బ్యాడ్ కామెంట్లు చేయడం, ఆ కామెంట్లను వైరల్ చేయడం మంచి పద్ధతి కాదని లోబో అన్నారు.ఎందుకు చెత్త కామెంట్లు రాస్తున్నారో అర్థం కావడం లేదని లోబో వెల్లడించారు.

బ్యాడ్ కామెంట్లు చేసేముందు ఒకసారి ఆలోచించాలని ఒక మంచి తల్లికి పుడితే ఈ విధంగా బ్యాడ్ కామెంట్లు రాయరని ఆయన కామెంట్లు చేశారు.భోళా శంకర్ గురించి నెగిటివ్ కామెంట్లు చేయాల్సిన అవసరం ఏముందని లోబో చెప్పుకొచ్చారు.

భోళా శంకర్ ( Bhola Shankar )సినిమాతో పాటు నాపై కూడా బ్యాడ్ కామెంట్లు చేశారని లోబో పేర్కొన్నారు.మేము ఎంత కష్టపడతామో కామెంట్లు చేసిన వాళ్లకు తెలియదని లోబో అన్నారు.

ఒక సినిమాను ఎన్ని కోట్లు ఖర్చు చేసి తీస్తారో మీకు తెలియదని లోబో పేర్కొన్నారు.ఎంతో కష్టపడిన సినిమాను ఒకే ఒక్క మాటతో బాలేదు అని చెబుతారని లోబో వెల్లడించారు.కష్టాన్ని నమ్మిన వాళ్లు బ్యాడ్ కామెంట్లు చేయరని లోబో తెలిపారు.లోబో వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా( Social media ) వేదికగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube