భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి టీడీపీ చంద్రబాబు లేఖ రాశారు.ప్రభుత్వ ప్రోత్సాహంతో తనపై దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ క్రమంలో తనపై జరుగుతున్న దాడులపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.
సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాయని చంద్రబాబు విమర్శించారు.
రాష్ట్రంలో తీవ్రమైన అసాధారణ పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.జగన్ సీఎం అయిన తరువాత రాష్ట్రంలో హింసతో పాటు నిరంకుశ పాలన, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ప్రజావేదిక కూల్చివేత మొదలు దేవాలయాలపై దాడులు, గంజాయి అమ్మకాలు, శాంతి భద్రతలను చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు.







