LML Electric Scooter : మార్కెట్‌లోకి ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ స్కూటర్.. రూపాయి కట్టకుండానే బుక్ చేసుకోవచ్చు..

ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై ఇటీవల కాలంలో ప్రజలకు మక్కువ పెరుగుతోంది.మార్కెట్‌లోకి వస్తున్న నాణ్యమైన ఎలక్ట్రిక్ బైక్‌లను వినియోగదారులు ఆదరిస్తున్నారు.

 Lml Electric Scooter In The Market Can Be Booked Without Paying A Rupee , Electr-TeluguStop.com

ఈ తరుణంలో ఎల్ఎంఎల్ కంపెనీ మార్కెట్‌లోకి తొలిసారి స్టార్ స్కూటర్‌తో రానుంది.భారతదేశ మార్కెట్‌లో పాగా వేయాలని భావిస్తోంది.

కంపెనీ ఇటీవలే LML స్టార్ కోసం బుకింగ్‌లను ప్రారంభించింది.ఎల్ఎంఎల్ కంపెనీ నుంచి రాబోయే మూడు బైక్‌లలో ఇది కూడా ఒకటి.

భారతదేశంలో విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో తనకంటూ ఒక స్థలాన్ని సృష్టించుకోవడం కోసం, LML స్టార్ కోసం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.ఆసక్తిగల కొనుగోలుదారులు LML వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.LML స్టార్‌ స్కూటీని రిజర్వ్ చేసుకోవచ్చు.ప్రస్తుతానికి, రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ ధర గురించి వివరాలు పెద్దగా తెలియవు.ఈ స్కూటర్ గురించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ఎల్ఎంఎల్ కంపెనీ నివేదికల ప్రకారం, స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రయాణికులకు చక్కటి అనుభవం అందించనుంది.

స్పోర్టీ రైడ్, సర్దుబాటు చేయగల సీటింగ్, ఇంటరాక్టివ్ స్క్రీన్, ఫోటోసెన్సిటివ్ హెడ్‌ల్యాంప్, చూడచక్కని నిర్మాణంతో వస్తుంది.స్కూటర్ 350-డిగ్రీ, హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ మరియు LED లైటింగ్‌తో కూడా వస్తుంది.

ఆసక్తికర విషయం ఏమిటంటే LML స్టార్‌ స్కూటర్‌ను రిజర్వ్ చేయడానికి ఎవరూ ఎలాంటి మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు.LML కంపెనీ MD, CEO డాక్టర్ యోగేష్ భాటియా దీనిపై కీలక విషయాలను వెల్లడించారు.

ఎలక్ట్రిక్ వాహనాలపై ఇప్పటికే పెరుగుతున్న అంచనాలను తమ ఎల్ఎంఎల్ స్టార్ అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అంతేకాకుండా, LML మరో రెండు వాహనాలను కూడా మార్కెట్‌లోకి తీసుకురానుంది.

LML దీనిని ‘వన్-ఆఫ్-ఎ-కైండ్ రైడ్’తో కూడిన డర్ట్ బైక్‌గా పిలుస్తుంది.నగర ప్రయాణానికి ఇది అనువుగా ఉంటుంది.

Telugu Lmlelectric-Latest News - Telugu

ఇది హైపర్ మోడ్‌తో వస్తుంది.జీరో నుండి 70 కిమీ వేగాన్ని చాలా తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు.ఈ ఎలక్ట్రిక్ బైక్ పోర్టబుల్ బ్యాటరీ, ఫ్లై-బై-వైర్ టెక్, పెడల్ అసిస్ట్‌తో వస్తుంది.ఆ తర్వాత ఎల్‌ఎమ్‌ఎల్ ఓరియన్ ఎలక్ట్రిక్ ‘హైపర్‌బైక్’.ఇది తేలికపాటి, చురుకైన సిటీ రైడ్‌లను అందించడానికి రూపొందించారు.ఇది ఆల్-వెదర్ సేఫ్టీ హామీతో కూడిన IP67-రేటెడ్ బ్యాటరీతో వస్తుంది.

ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇన్-బిల్ట్ GPSని అందుబాటులోకి తీసుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube