అక్షరాలా 67 కోట్లు..నెగటివ్ టాక్ తో ప్రభాస్ కి మాత్రమే సాధ్యమైన రికార్డు ఇది!

ఓటీటీ కి ఆడియన్స్ బాగా అలవాటు పడిన తర్వాత ఈమధ్య కాలం లో విడుదల అవుతున్న సినిమాలకు అద్భుతమైన పాజిటివ్ టాక్ వస్తే తప్ప, థియేటర్స్ వైపు కూడా చూడని పరిస్థితి ఏర్పడింది.

ఫలితంగా భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పల్టీలు కొట్టేస్తున్నాయి.

వారం రోజులు కూడా పూర్తి అవ్వకుండానే థియేటర్స్ నుండి వెళ్లిపోతున్నాయి.స్టార్ హీరోలు కూడా ఇందుకు మినహాయింపు కాదు.

కానీ ఇలాంటి పరిస్థితులలో కూడా ప్రభాస్ సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా తొలి మూడు రోజులు దంచికొట్టేస్తున్నాయి.గతం లో విడుదలైన సాహూ మరియు రాధే శ్యామ్ సినిమాలు అందుకు ఉదాహరణ.

ఇప్పుడు రీసెంట్ గా విడుదలైన ఆదిపురుష్( Adipurush ) చిత్రం మరో ఉదాహరణగా నిల్చింది.ఈ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదలై మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ ని తెచ్చుకుంది.

Literally 67 Crores..this Is A Record Possible Only For Prabhas With Negative Ta
Advertisement
Literally 67 Crores..This Is A Record Possible Only For Prabhas With Negative Ta

అయితే సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉండడం వల్ల ఓపెనింగ్స్ అదిరిపోయాయి, కానీ టాక్ లేదు కాబట్టి రెండవ రోజు నుండి వసూళ్లు బాగా డౌన్ అవుతాయని అనుకున్నారు ట్రేడ్ పండితులు.కానీ ప్రభాస్ స్టామినా వాళ్ళ అంచనాలను తలక్రిందులు చేసింది, నూన్ షోస్ కాస్త స్లో గానే ప్రారంభం అయ్యినప్పటికీ, మ్యాట్నీస్ నుండి బాగా పికప్ అయ్యింది.ఫస్ట్ షోస్ మరియు సెకండ్ షోస్ కి వచ్చిన ఆక్యుపెన్సీలు మరియు హౌస్ ఫుల్స్ చూసి ట్రేడ్ పండితుల మైండ్ బ్లాస్ట్ అయ్యినంత పని అయ్యింది.

ముఖ్యంగా హిందీ లో ఈ చిత్రానికి వచ్చిన నెగటివ్ రివ్యూస్ మామూలు రేంజ్ కాదు.పెద్ద పెద్ద క్రిటిక్స్ సైతం ఈ సినిమాకి ఒక్క స్టార్ రేటింగ్స్ ఇచ్చారు.

ఆ స్థాయి రేటింగ్స్ ఉన్నా కూడా ఈ చిత్రానికి రెండవ రోజు మొదటి రోజు కంటే ఎక్కువగా , అంటే 40 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.

Literally 67 Crores..this Is A Record Possible Only For Prabhas With Negative Ta

ఇక ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వసూళ్లు చూస్తే రెండవ రోజు ఈ చిత్రానికి 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది, అందులో కేవలం తెలంగాణ ప్రాంతం నుండే ఈ సినిమాకి 10 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చిందని అంటున్నారు.హైదరాబాద్ సిటీ లో కేవలం వీకెండ్ వరకు మాత్రమే కాదు, హైదరాబాద్( Hyderabad) కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సోమవారం రోజుకి బుక్ మై షో లో ఇప్పటి నుండే హౌస్ ఫుల్స్ పడిపోయాయని, ఈ సునామి రన్ ఇప్పట్లో ఆగే ఛాన్స్ లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.అలా రెండు రోజులకు గాను ఈ చైర్ట్రం 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించిందని , నెగటివ్ టాక్ తో ఈ రేంజ్ వసూళ్లు ఎవరికీ కూడా సాధ్యపడదు అంటూ బాలీవుడ్( BOLLYWOOD ) ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు