అప్పుడే కొత్త ఏడాది స్టార్ట్ అయ్యి సగ భాగం పూర్తి అయ్యింది.2023 తొలి సగం పూర్తి అయ్యింది.కానీ టాలీవుడ్ లో ఈసారి హీరోలంతా ప్రేక్షకులను నిరాశ పరిచారు అనే చెప్పాలి.సంక్రాంతి మినహాయిస్తే పెద్దగా మెరుపులు చూపించకుండానే సగం ఏడాది పూర్తి చేసారు.ఇక కీలకమైన సమ్మర్ ను కూడా వృధా చేసారు.మరి ఈసారి సెకండాఫ్ మాత్రం అలా కాదట.
ఈసారి సెకండాఫ్ ను అదరగొట్టేందుకు మేకర్స్ సైతం సిద్ధం అవుతున్నారు.రాబోయే ఆరు నెలలు కూడా ప్రేక్షకులకు కమర్షియల్ ట్రీట్ ఇచ్చేందుకు రంగం సిద్ధం అయ్యింది.ఇక జులై నెలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో సినిమాతో( Bro Movie ) బాక్సాఫీస్ సందడి స్టార్ట్ అవ్వనుంది.ఈ సినిమా జులై 28న రిలీజ్ కాబోతుంది.
ఇక అప్పటి నుండి వరుసగా సినిమాల సందడి స్టార్ట్ కానుంది.
బ్రో వచ్చిన వారానికే ఆగస్టు 4న అనుష్క శెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ( Ms shetty Mrs Polishetty ) రిలీజ్ కానుంది.ఆ తర్వాత వారం ఆగస్టు 11న మెగాస్టార్ భోళా శంకర్( Bhola Shankar ) రిలీజ్ కానుంది.దీంతో పాటు రజినీకాంత్ జైలర్ కూడా రాబోతుంది.
అలాగే ఆగస్టు చివరిలో వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున రాబోతుంది.
మరి ఆ తర్వాత సెప్టెంబర్ లో విజయ్, సమంత ఖుషి,( Khusi Movie ) షారుఖ్ ఖాన్ జవాన్,( Jawan ) బోయపాటి రామ్ స్కంద తో పాటు డార్లింగ్ ప్రభాస్ సలార్ కూడా ఇదే నెలలో రాబోతుంది.ఇక అక్టోబర్ లో దసరాకు ఫుల్ ట్రీట్ సిద్ధం అవుతుంది.బాలయ్య భగవంత్ కేసరితో పాటు రవితేజ టైగర్ నాగేశ్వరరావు కూడా రిలీజ్ కానున్నాయి.
అలాగే విజయ్ దళపతి లియో కూడా ఇదే నెలలోనే ఉంటుంది.
ప్రస్తుతానికి ఇవే అయినా దసరా సీజన్ లో మరికొన్ని సినిమాలు యాడ్ అయ్యే అవకాశం ఉంది.ఇక నవంబర్ లో దీపావళి కానుకగా ప్రస్తుతానికి ఏమీ లేకపోయిన ముందు ముందు ప్రకటించే అవకాశం ఉంది.ఇక డిసెంబర్ లో పవన్ కళ్యాణ్ ఓజి తో పాటు నాని 30 సినిమా, వెంకటేష్ సైన్ధవ్ కూడా రానున్నాయి.
ఇలా 2023 సెకండాఫ్ ఫుల్ కళకళ లాడబోతుంది.