టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు( Sri Vishnu ) తాజాగా నటించిన చిత్రం సామజవరగమన.రామ్ అబ్బ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ల వర్షం కురిపిస్తోంది.
అంతేకాకుండా ప్రముఖుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంటోంది.చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ఏకంగా అఖిల్ నటించిన స్పై ( Spy )సినిమాని వెనక్కి నెట్టేసింది.
కలెక్షన్ల పరంగా దుమ్ము రేపుతోంది.కంటెంట్ పరంగా చూస్తే ప్రేక్షుకులు సామజవరగమన సినిమాకే బ్రహరథం పడుతున్నారు.కేవలం నాలుగే నాలుగు రోజుల్లో ఏకంగా రూ.19.8 కోట్లు గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది ఈ సినిమా.

ఇటువంటి సమయంలో సాక్రిఫైజ్ స్టార్ గా సునిశిత్ ( Sunishit )ఈ మూవీపై రివ్యూ చెప్పడంతో పాటు రేటింగ్ కూడా ఇచ్చాడు.ఈ సినిమాకి 3.5 రేటింగ్ ఇస్తూ.ఎప్పటిలాగే ఈ సినిమాలో తననే హీరో అనుకున్నారని చెప్పాడు.మనోడి బడాయి గురించి అతని మాటల్లోనే వింటే బాగుంటుంది.సామజవరగమన చిన్న సినిమా అయినా పెద్ద విజయం సాధించింది.నా జడ్జిమెంట్ కరెక్ట్ అని మరోసారి నిరూపించింది.
ఈ స్టోరీతో డైరెక్టర్ నన్ను అప్రోచ్ అయినప్పుడు ఈ కథ నా ఇమేజ్‌కి సరిపోదు శ్రీ విష్ణు అయితే బాగుంటుందని చెప్పాను.చాలా రోజుల తర్వాత తెలుగులో కుటుంబం మొత్తం కలిసి చూసే క్లీన్ కామెడీ ఎంటర్టైనర్.
ఇంటర్వెల్ తర్వాత 15 నిమిషాల పాటు కడుపుబ్బ నవ్వాను.స్నేహితుడు శ్రీవిష్ణు నాకోసం ప్రత్యేకంగా ప్రసాద్ లాబ్స్‌లో షో ఏర్పాటు చేశాడు.

షో అయిపోయాక టోలిచౌకి షాగౌస్ హోటల్లో మటన్ బిర్యానీ పాయ ఎంజాయ్ చేసాము.మూవీకి నా రేటింగ్ – 3.3/5 అంటూ తన ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టాడు సునిశిత్.ఆ పోస్ట్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజెన్స్.
ఇంతలోనే ఒక నెటిజన్.అన్నా నా దగ్గర ఒక స్టోరీ ఉందన్నా.
టైటిల్ ఏంటంటే లేవనేని మొగుడు- లేచిపోయిన పెళ్ళాం దానికి హీరో నువ్వైతే బాగుంటుంది అంటూ కామెంట్ పెట్టాడు.అయితే దానికి సునిశిత్ కూడా అదిరిపోయే రేంజ్ లో రిప్లై ఇచ్చాడు.
అయితే ఏం పెట్టాడు అన్నది తెలియాలి అంటే పోస్ట్ ని చూడాల్సిందే మరి.