మద్యం విక్రయాలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.కరోనా వైరస్ లాక్ డౌన్ పూర్తికాకుండానే మద్యం విక్రయాలు ప్రారంభించడం తో వాటిపై నిషేధం విధించాలి అంటూ సుప్రీంకోర్టు లో పిటీషన్ దాఖలు అయ్యింది.
అయితే దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ విక్రయాలను ఆపబోమని, అయితే, రాష్ట్రాలు హోం డెలివరీ చేసే అవకాశాలను పరిశీలించాలంటూ కోర్టు సూచించడం గమనార్హం.
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టకుండానే ప్రజలు మద్యం కోసం బయటకు వస్తూ భౌతిక దూరం పాటించకుండా బార్ ల వెంట పడుతుండడం తో ఈ వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందంటూ సుప్రీంకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు.

ఈ పిల్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది.రద్దీని తగ్గించేందుకు ఆన్ లైన్ ద్వారా లేదా హోమ్ డెలివరీ విధానాలు అవలంబించవచ్చని సూచించింది.అయితే మద్యం నిషేధం మీద తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని, అది పాలసీ నిర్ణయం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అనంతరం ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.మద్యం విక్రయాలు జరిపే ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించడం లేదంటూ పిటిషనర్ తరఫున న్యాయవాదులు వాదించారు.లిక్కర్ షాపులు సంఖ్య తక్కువగా ఉండడంతో, మద్యం ప్రియులు భారీగా క్యూ కడుతున్నారని చెప్పారు.అయితే, దీనికి సంబంధించి తాము రాష్ట్రాలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోమని, కావాలంటే ఆన్ లైన్, హోం డెలివరీ వంటి ఆప్షన్లను రాష్ట్రాలు అవలంభించాలంటూ అత్యున్నత న్యాయస్థానం సూచించింది.