మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది.ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉండటంతో మందుబాబుల జేబుకు చిల్లులు పడుతున్న విషయం తెలిసిందే.

అధిక ధరలు పెట్టి మందుబాబులు మద్యం కొనలేని పరిస్థితి నెలకొంది.ఈ క్రమంలో మందుబాబులకు ఊరట కలిగించేలా తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీలో మద్యం ధరలను మరోసారి ప్రభుత్వం సవరించింది.ఈ సవరించిన మద్యం ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.

ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది.భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం, మీడియం, ప్రీమియం బ్రాండ్ల ధరలను తగ్గించిన ప్రభుత్వం.రూ.50 నుంచి రూ.1,350 వరకూ వివిధ కేటగిరీల్లో మద్యం ధరలు తగ్గించింది.మద్యం ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించడం ఇది తొలిసారి కాదు.

Advertisement

గతంలో అనేకసార్లు పెంచడం, తగ్గించడం చేసింది.లాక్‌డౌన్ తర్వాత మధ్యం ధరలను భారీగా పెంచిన ప్రభుత్వం.

ఆ తర్వాత ఇటీవల కొంతవరకు తగ్గించింది.ఈ క్రమంలో తాజాగా మరోసారి మద్యం ధరలను తగ్గించింది.

మద్యం ధరలు తగ్గించడంపై మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఏపీలో మద్యం ధరలను అధిక ధరలకు అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

బాటిల్ మీద ఒక రేటు ఉంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.అలాగే ఏపీలో రోజుకో మద్యం బ్రాండ్ వస్తుందని, ప్రభుత్వ మద్యం షాపుల్లో మందుబాబులు అడిగిన బ్రాండ్ కాకుండా తమకు నచ్చిన బ్రాండ్‌లను అధికారులు విక్రయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

Advertisement

తాజా వార్తలు