ఢిల్లీ లిక్కర్ పాలసీ( Delhi Liquor Policy ) ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) విచారణను రేపటికి వాయిదా వేసింది.
కవిత పిటిషన్ పై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది.ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత తరపున వాదనలు ముగియగా.
రేపు ఈడీ వాదనలు కొనసాగనున్నాయి.అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసులలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై( Kavitha Bail Petition ) విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.ఇక సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన రౌస్ అవెన్యూ కోర్టు వాదనలు విన్న తరువాత తీర్పును రిజర్వ్ చేసింది.
ఈ మేరకు సీబీఐ కేసులో తీర్పును మే 2వ తేదీన వెలువరించనుంది.