ఏపీలో అంగన్‎వాడీ సూపర్‏వైజర్ పోస్టుల భర్తీకి లైన్‎క్లియర్

ఏపీలో అంగన్‎వాడీ సూపర్‏వైజర్ పోస్టుల భర్తీకి లైన్‎క్లియర్ అయింది.మెరిట్ లిస్టులో పేర్లు ఉన్నప్పటికీ ప్రక్రియను నిలిపివేశారని అభ్యర్థులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

అదేవిధంగా తమకు అన్యాయం జరిగిందని మరికొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో వాదనలు విన్న కోర్టు పాత ప్రక్రియనే కొనసాగించాలని తీర్పును వెలువరించింది.

దీంతో అంగన్‎వాడీ సూపర్‏వైజర్ పోస్టుల భర్తీకి ఆటంకాలు తొలగడంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మ్యానిఫెస్టో.. : సీఎం జగన్
Advertisement

తాజా వార్తలు