లైగర్ గొడవలు ఇంకా ఎన్నాళ్లు... ఛార్మి హామీ తర్వాత కూడా అదే రచ్చ

విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) హీరోగా అనన్య పాండే( Ananya Pandey ) హీరోయిన్ గా రూపొందిన లైగర్ సినిమా ఏ స్థాయిలో డిజాస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆ సినిమా పై నమ్మకంతో పూరి జగన్నాధ్ చాలా ఖర్చు పెట్టాడు.

 Liger Is The Concern Of The Distributors Of The Movie , Charmi, Flim News, Liger-TeluguStop.com

ఛార్మి సహ నిర్మాతగా వ్యవహరించింది.సినిమాకు పాన్ ఇండియా మూవీ అంటూ ప్రచారం చేయడంతో భారీగానే బిజినెస్ అయ్యింది.

కానీ సినిమా వసూళ్ల విషయంలో తీవ్రంగా నిరాశ పర్చింది.

Telugu Charmi, Liger, Puri-Movie

ఆశించిన కలెక్షన్స్ లో కనీసం 10 శాతం కూడా రాబట్టలేక పోయింది.దాంతో లైగర్ సినిమా( Liger movie ) ను కొనుగోలు చేసిన వారు ఎంతో మంది ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు.దాదాపు ఏడాది కాలంగా వారు ఆందోళన చేస్తూనే ఉన్నారు.

అయినా కూడా మేకర్స్ నుండి ఎలాంటి స్పష్టత రాలేదు.ముఖ్యంగా నైజాం ఏరియా ఎగ్జిబీటర్స్( Nizam Area Exhibitors ) పరిస్థితి దారుణంగా ఉంది అంటూ ఆందోళనలు చేస్తున్నారు.

ఒక వైపు పూరి మరో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండగా లైగర్ ఎఫెక్ట్‌ నుండి ఆయన ఇప్పట్లో బయట పడే పరిస్థితి లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Charmi, Liger, Puri-Movie

ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.లైగర్ గొడవలు ముందు ముందు అయినా సర్దుమనిగితే పూరి జగన్నాధ్ తదుపరి సినిమా విషయంలో శ్రద్ద పెడుతాడు అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఛార్మి( Charmy ) గత కొంత కాలంగా ఈ విషయమై గొడవ లేకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇటీవల కూడా డిస్ట్రిబ్యూటర్లకు మరియు అందరికి కూడా తప్పకుండా న్యాయం చేస్తాం అన్నట్లుగా హామీ ఇచ్చింది.అయినా కూడా ఆందోళన విరమించలేదు.ఈ లైగర్ గొడవలు ఆందోళనలు ఎన్నాళ్లు సాగుతాయో అర్థం కావడం లేదు.వారికి సెటిల్ చేయాలి అంటే కనీసం పాతిక కోట్లు అవసరం ఉంటుందని తెలుస్తతోంది.

మరి అంత ఉందా అంటే అనుమానమే అనే చర్చ జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube