హిందీ ప్రేక్షకులకు లైగర్ నచ్చిందా.. అందుకే అంత వసూళ్లు రాబడుతుందా?

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లైగర్.ఈ సినిమా కోసం ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురు చూసారు.

 Liger Hindi Box Office Collection, Vijay Deverakonda, Liger, Puri Jagannadh, Ana-TeluguStop.com

అయితే ఆగష్టు 25న ఈ సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ అయ్యింది.ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించగా ఇందులో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించింది.

మొదటిసారిగా పాన్ ఇండియా సినిమా చేస్తున్న ఎప్పుడు లేనంత హైప్ క్రియేట్ అయ్యింది.

అయితే ఇన్ని అంచనాల మధ్య రిలీజ్ అయినా లైగర్ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

ఫ్యాన్స్ ను మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులను కూడా ఏ విషయంలో సంతృప్తి పరచలేక పోయింది.రిలీజ్ అయినా అన్ని చోట్ల ప్లాప్ టాక్ రావడంతో రౌడీ స్టార్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు.

అయితే ఈ సినిమా విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.

Telugu Ananya Pandey, Bollywood, Liger, Liger Hindi Box, Puri Jagannadh-Movie

కానీ ప్లాప్ టాక్ రావడంతో ఈ సినిమా వసూళ్లు తగ్గాయి.కానీ రిలీజ్ అయినా మిగతా అన్ని చోట్ల కంటే హిందీలో మాత్రం పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంది అనే చెప్పాలి.ఈ సినిమా బాలీవుడ్ లో కాస్త వసూళ్లు రాబడుతుంది.

మొదటి రోజు ప్లాప్ టాక్ వచ్చిన ఆ తర్వాత రెండు రోజులు కూడా అదే రకంగా వసూళ్లు వస్తున్నాయని అక్కడి ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఇలా వసూళ్లు స్టడీగా రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

శనివారం కూడా ఈ సినిమా 4 కోట్ల 50 లక్షలు వసూళ్లు చేసినట్టు టాక్.దీనిని బట్టి అక్కడ మిగతా చోట్ల కంటే మెరుగ్గా వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చూడాలి ఈ సినిమా ఈ వెకెండ్ గడిచే సరికి ఎంత వసూళ్లు చేస్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube