విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడింది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ను దాదాపుగా 70 కోట్ల రూపాయలకు గాను వరంగల్ శ్రీను కొనుగోలు చేశాడు అంటూ వార్తలు వచ్చాయి.
ఇప్పుడు ఆయన పెట్టిన పెట్టుబడిలో దాదాపుగా 35 శాతం మాత్రమే వెనక్కు వచ్చిందని 65% నష్ట పోయాను అంటూ ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పేర్కొన్నాడు. వరంగల్ శ్రీను ఈ సినిమా తో భారీగా నష్ట పోవడంతో దర్శకుడు పూరి జగన్నాథ్ మరియు హీరో విజయ్ దేవరకొండ కొత్త మొత్తం లో వెనక్కు ఇచ్చేందుకు ఓకే చెప్పారని కూడా సమాచారం అందుతుంది.
ఈ సమయం లోనే వరంగల్ శ్రీను మీడియా తో మాట్లాడుతూ సినిమా వల్ల భారీగా నష్ట పోయిన విషయం నిజమే.కానీ విజయ్ దేవరకొండ నటన అంటే తనకి ఇష్టమని అతడు నటించిన సినిమాలు అంటే ఇష్టమని అతను ఒక మంచి వ్యక్తి అంటూ ఒక స్టార్ అంటూ వరంగల్ శ్రీను ఆసక్తికరంగా విజయ్ దేవరకొండ పై ప్రశంసల వర్షం కురిపించాడు.
వరంగల్ శ్రీను నేను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.విజయ్ దేవరకొండ తో సన్నిహిత్యం కోరుకుంటున్నట్లుగా వరంగల్ శ్రీను మాటలను బట్టి అర్థమవుతుంది.వరుసగా సినిమా లు పంపిణీ చేయడం తో పాటు నిర్మాణం లో కూడా అడుగు పెట్టాలని భావిస్తున్న వరంగల్ శ్రీను త్వరలోనే విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేయబోతున్నాడు అన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ మూడు నాలుగు సినిమా లకు కమిట్ అయి ఉన్నాడు.
కనుక వరంగల్ శ్రీను అడిగినా కూడా డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు.అయినా కూడా వరంగల్ శ్రీను విజయ్ దేవరకొండ పై ప్రశంసలు కురిపించాడు అంటే నిజమైన అభిమానం అయ్యి ఉండవచ్చు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి భారీగా నష్టపోయిన కూడా విజయ్ దేవరకొండపై ఆయనకు కోపం లేకపోవడం కాస్త ఆలోచించదగ్గ విషయమే అంటూ సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో చర్చ జరుగుతుంది.