జైలు నుంచి పరారయ్యేందుకు ఓ ఖైదీ చేసిన ప్రయత్నం విఫలం అయింది.అంతే కాదండోయ్.
పారిపోయేందుకు ఎక్కినచెట్టు కొమ్మల్లోనే చిక్కుకుపోయాడు.ఈ ఘటన కేరళ తిరువనంతపురంలో జరిగింది.
అసలేం జరిగిందంటే.కేరళ తిరువనంతపురం జైలులో ఓ వ్యక్తి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు.
ఓ హత్య కేసులో దోషి అయిన అతడికి కోర్టు జీవించి ఉన్నంత కాలం జైలు శిక్ష అనుభవించాలంటూ శిక్ష విధించింది.పూజప్పుర సెంట్రల్ జైలులో అతడు ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నాడు.
అయితే జైలు జీవితం గడపడం ఇష్టం లేక అక్కడి నుండి పారిపోవాలని ప్లాన్ వేశాడు.జైలుకు పక్కన ఉన్న చెట్ల సాయంతో ఆ కఠిన జీవితం నుండి పారిపోయి.
హాయిగా బతకాలని కలలు కన్నాడు.అయితే అతని ఆశలన్నీ ఆవిరయ్యాయి.
ఎందుకంటే పారిపోయే ప్రయత్నంలో పోలీసులకు చిక్కాడు.అది కూడా విచిత్రంగా.
ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చెట్టు ఎక్కిన ఖైదీ.
అనుకోకుండా అక్కడే ఇరుక్కుపోయాడు.తీరా ఈ విషయం పోలీసులకు తెలియగా వారు వచ్చి అతడిని అతి కష్టం మీద కిందకు తీసుకువచ్చారు.
దాదాపు గంటన్నరకు పైగా చెట్టుపైనే ఉండి ఆ ఖైదీ నానా యాగీ చేశాడు.పోలీసులు కిందకు దించేందుకు ప్రయత్నించినా వినలేదు.
చివరకు చెట్టు కొమ్మ విరగడంతో కింద ఏర్పాటు చేసిన వలలో పడిపోయాడు.అనంతరం జైలులోని ఆస్పత్రికి ఆ ఖైదీ తరలించారు.
ఖైదీని కొట్టాయంకు చెందిన సుభాష్ గా గుర్తించారు.హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న అతడు.
నెట్టుకల్తేరి జైలు నుండి పూజప్పురకు వచ్చాడు.







