మధ్యలో ఆగిపోయిన పాలసీలకు గుడ్ న్యూస్ అందించిన ఎల్ఐసీ

తమ పాలసీలను పునరుద్ధరించాలనుకునే వారికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) బంపరాఫర్ అందించింది.తమ పాలసీదారులకు తిరిగి కొనసాగించాలనుకునేందుకు ఒక ప్రత్యేక అవకాశాన్ని ప్రకటించింది.

 Lic Has Given Good News To Policies That Have Stopped In The Middle Details, Li-TeluguStop.com

వ్యక్తిగత ల్యాప్స్ అయిన ఎల్ఐసీ పాలసీలను పునరుద్ధరించడానికి బీమా సంస్థ తన కస్టమర్ల కోసం ఒక విలక్షణమైన ప్రత్యేక పునరుద్ధరణ క్యాంపెయిన్‌ను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది.ఆగస్టు 17 నుంచి ఇది ప్రారంభమవుతుంది.

అక్టోబర్ 21, 2022 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.అనుకోని పరిస్థితుల వల్ల ప్రీమియంలు చెల్లించలేకపోయిన, పాలసీ ల్యాప్ అయిన వారికి ఈ ఆఫర్ ఎంతో ఉపయోగపడనుంది.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే మన కుటుంబ సభ్యులకు భరోసానిస్తుంది.

అందుకే చాలా మంది తమ కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం ఎల్ఐసీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కడుతుంటారు.కొన్ని సార్లు అనుకోని కారణాల వల్ల పాలసీలు మధ్యలోనే కొందరు ఆపేస్తుంటారు.

అలాంటి వారికి ఎల్ఐసీ గుడ్ న్యూస్ అందించింది.పాలసీ హోల్డర్‌లకు వారి ల్యాప్ అయిన పాలసీలను పునరుద్ధరించడానికి, వారి కుటుంబ ఆర్థిక ప్రయోజనాలను రక్షించడానికి ఎల్ఐసీ మంచి అవకాశాన్ని అందిస్తోంది.

బీమా ప్రయోజనాలను కొనసాగించడానికి అరుదైన అవకాశాన్ని ఇచ్చింది.

Telugu Helath, Holders, Insurance, Lic, Scheme, Policy, Policy Laps, Regulatory-

ULIP పాలసీలు మినహా, అన్ని పాలసీలు పాలసీ షరతులకు లోబడి మొదటి చెల్లించని ప్రీమియం తేదీ నుండి 5 సంవత్సరాలలోపు ఉన్నవి పునరుద్ధరించబడతాయి.రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, రూ.1 లక్ష వరకు మొత్తం స్వీకరించదగిన ప్రీమియం 25% ఆలస్య రుసుము రాయితీని కలిగి ఉంటుంది.గరిష్టంగా రూ.2,500 వరకు అనుమతించబడుతుంది.ఇంకా రూ.1,00,001 నుండి రూ.3 లక్షల మధ్య స్వీకరించదగిన ప్రీమియంల కోసం, ఆలస్య రుసుము రాయితీ 25% లాగానే ఉంటుంది కానీ గరిష్టంగా రూ.3,000 రాయితీ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube