మొన్నటి వరకు తెలంగాణ బీజేపీలు అంతా తానే వ్యవహరించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఊహించని దానికంటే ఎక్కువగానే బిజెపి బలోపేతం అయింది.
ఇక 2023లో జరగబోయే సార్వత్రికల్లోనూ పార్టీని గెలిపించి తన సత్తా చాటుకోవాలని సంజయ్ భావిస్తున్నారు.ముఖ్యమంత్రి అభ్యర్థిగాను బిజెపి అధిష్టానం ప్రకటిస్తుంది అనే నమ్మకంతో సంజయ్ ఉండగా, ఇప్పుడు ఆయనకు బిజెపిలోనే పోటీ పెరుగుతోంది. మొన్నటి వరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ మధ్య ఆధిపత్య పోరు నడిచింది.2023 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి కనుక అధికారంలోకి వస్తే ఈ ఇద్దరి మధ్య ముఖ్యమంత్రి సీటు విషయంలో పోటీ ఉంటుందని అందరూ భావించారు.
అయితే ఇప్పుడు మరి కొంతమంది అదే ఆశతో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.ముఖ్యంగా టిఆర్ఎస్ మాజీమంత్రి ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బిజెపిలో చేరిన సమయంలోనే ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం జరిగింది.
దీనిపై కాస్త హడావుడి కొంతకాలం నడిచినా, ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగింది.అయితే ఇప్పుడు ఆ ఆధిపత్య పోరు మరింత తీవ్రతరం అయినట్టుగా కనిపిస్తోంది.ముఖ్యంగా ఈ ఇద్దరు మధ్య పరోక్షంగా ‘స్థాయి ‘ వ్యవహారంపై పోరు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.ఈ మధ్యకాలంలో ఈటెల రాజేందర్ హడావుడి ఎక్కువ కనిపిస్తోంది.
ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై తానే పోటీ చేస్తానని రాజేందర్ ప్రకటించారు. హుజురాబాద్ నియోజకవర్గం లో కి వచ్చి తనపై పోటీ చేసినా ఫర్వాలేదని, లేకపోతే ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా తానే అభ్యర్థిగా ఉంటానంటూ ప్రకటనలు చేయడం బండి సంజయ్ కు తీవ్ర అసంతృప్తిని , ఆగ్రహాన్ని కలిగిస్తోందట.

దీంతో పరోక్షంగా ఈటెల వ్యవహారంపై బండి సంజయ్ ప్రకటన చేశారు.బిజెపిలో ఎవరికి వారు ఇస్తానుసారంగా టికెట్లు ప్రకటించుకునే సాంప్రదాయం లేదని, తానూ కరీంనగర్, వేములవాడ, ఎల్బీనగర్ తదితర నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నట్లుగా కొంతమంది ప్రచారం చేస్తున్నారని, తాను కూడా ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనేది అధిష్టానం పెద్దలే నిర్ణయిస్తారని సంజయ్ ప్రకటించారు.అయితే ఈ ప్రకటన ‘ఈటెల రాజేందర్ ‘ ను ఉద్దేశించి చేసిందే అనే అనుమానం అందరిలోనూ కలుగుతోంది.అదీ కాకుండా ఈటెల రాజేందర్ కు చేరికలు కమిటీ కన్వీనర్ బాధ్యతలు అప్పగించడంతో, ఆయన ద్వారా చేరికలు ఊపందుకుంటాయి అని, అంత భావించారు.
అయితే ఆ చేరికలు అంతంత మాత్రమే అన్నట్టుగా ఉన్నాయి.దీనికి కారణం రాజేందర్ సమక్షంలో బిజెపిలో చేరితే పెద్దగా ప్రాధాన్యం ఉండదని, సంజయ్ తమను పక్కన పెడతారని అభిప్రాయం చాలామంది నాయకుల్లో అనుమానం ఉండడంతోనే , ఈ ఇద్దరి నేతల మధ్య ఇబ్బందులు ఎదుర్కోవడం ఎందుకు అనే ఉద్దేశంతో ప్రస్తుతానికి బిజెపిలో చేరాలనుకున్న నాయకులు వేచి చూసే దోరణి ని అవలంబిస్తున్నారట.
ప్రస్తుతం ఈ సీనియర్ పొలిటిషన్లు ఇద్దరిలోనూ ఎవరు గొప్ప అనే విధంగా స్థాయి వివాదం అంతర్గతంగా జరుగుతున్నట్లుగా ఆ పార్టీలో చర్చ జరుగుతోంది
.






