తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు బిగ్బాస్ ని బాగా ఆదరించడం మనకు తెలిసిందే.ఇప్పటి వరకు స్టార్ మా లో ప్రసారం అయిన అన్ని సీజన్లలో ఎపిసోడ్ లకు కూడా మంచి రేటింగ్ దక్కింది.
అందుకే బిగ్బాస్ కొత్త సీజన్ ని మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ ఇటీవలే అధికారికంగా స్టార్ మా నుండి ప్రకటన వచ్చింది.ఆ అధికారిక ప్రకటన వచ్చి నెల రోజులు దాటింది.
అయినా కూడా ఇప్పటి వరకు బిగ్ బాస్ కి సంబంధించిన కొత్త అప్డేట్ రాకపోవడంతో ప్రేక్షకులు మరియు అభిమానులు అసంతృప్తి తో ఉన్నారు.ఆగస్టులో బిగ్ బాస్ కొత్త సీజన్ను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు గత నెలలో వార్తలు వచ్చాయి.
కానీ ఆగస్టు ప్రారంభమైంది.అయినా ఇప్పటి వరకు స్టార్ మా నుండి ఎలాంటి కొత్త అప్డేట్ రాకపోవడంతో అసలు ఈ నెలలో బిగ్బాస్ తెలుగు కొత్త సీజన్ ప్రారంభం అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతి సీజన్ కు ముందు తెగ హడావుడి చేసే షో నిర్వాహకులు ఈ సీజన్ను గురించి ఎలాంటి అప్డేట్ లే ఇవ్వక పోవడంతో పాటు ప్రోమో షూట్ కూడా ఎలాంటి హడావుడి కనిపించక పోవడంతో అక్టోబర్లో షో ప్రారంభం అవుతుందేమో అని కొందరు ప్రచారం భావిస్తున్నారు.బిగ్ బాస్ లో ఈసారి అడుగు పెట్ట బోతున్న కంటెస్టెంట్స్ విషయంలో ఇంకా ఒక తుది నిర్ణయం కు రాలేదని.
కంటెస్టెంట్స్ విషయం లోనే ఈ ఆలస్యం అంటూ స్టార్ మా ద్వారా సమాచారం అందుతోంది.ఏ విషయం ఏంటి అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు పాటు వెయిట్ చేయాల్సిందే ఏమో చూడాలి.
తెలుగు బిగ్ బాస్ ను ఈసారి మరింత ఆసక్తికరంగా.వివాదాస్పదంగా తీసుకు వస్తామని అంటున్నారు.







