పార్టీల మధ్య ' లేఖల ' వార్ ! 

రాజకీయ పార్టీల మధ్య లెక్కల వార్ ముదురుతోంది.

ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడమే కాకుండా లేఖలతో ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెడుతూ, ప్రజల్లో తమకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ లేఖల రాజకీయం గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ఎక్కువైంది.  కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, వివిధ సమస్యలపై టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ వంటివారు కేంద్రానికి తరచుగా రాస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ముఖ్యంగా వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు తో పాటు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఐఏఎస్ నిబంధనల సవరణ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులను అమ్మొద్దని ఇలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ లేఖలతో విరుచుకుపడుతున్నారు.దీనికి కౌంటర్ గా తెలంగాణ ప్రభుత్వ తీరును విమర్శిస్తూ బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు అనేక సమస్యలను ప్రస్తావిస్తూ తరచుగా లేఖలు రాస్తున్నారు.

ఒకవైపు బహిరంగంగానే విమర్శలు చేస్తూ మరోవైపు లేఖల ద్వారా ను పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఇదే విధంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ, మిగతా కేంద్రమంత్రులకు వివిధ సమస్యలను ప్రస్తావిస్తూ లేఖలు సంధిస్తున్నారు.

Advertisement

ఈ లేఖల్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం తదితర అంశాలపై ఎక్కువగా ప్రస్తావిస్తూ ప్రజల్లో ఆ అంశంపై చర్చ జరిగేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు .ఈ లేఖలను మీడియాకు విడుదల చేస్తూ ప్రజల కోసం తాము ఏ స్థాయిలో పని చేస్తున్నామనే విషయాన్ని హైలెట్ చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఏపీలో ను దాదాపు ఇదే రకమైన పరిస్థితి నెలకొంది.

రాబోయే ఎన్నికల వరకు ఈ లేఖల వార్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగేలా కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు