ప్రజాప్రతినిధులు.అధికారులు కొలువుతీరి ఉండే సచివాలయంలో ఓ చిరుత పులి ప్రవేశించింది.కాకపోతే అది అర్ధరాత్రివేళలో ఎక్కడంటే… గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో.ఈ విషయం సిసి ఫుటేజ్‌ల ద్వారా తెలుసుకున్న అధికారులు చిరుతను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు.అయితే రక్షణ వలయాన్ని దాటి ప్రాంగణంలోకి ఎలా ప్రవేశించిందో స్పష్టంగా తెలియరాలేదు.

రాత్రి 1 గంట సమయంలో సచివాలయంలో చక్కర్లు కొట్టినట్లు సిసిఫుటేజ్‌లో నమోదయ్యింది.దీంతో సచివాలయ ఆరు గేట్లను పోలీసులు మూసివేశారు.ప్రజలను, మంత్రులను, అధికారులను సచివాలయ ప్రవేశాన్ని నిషేధించారు.
చిరుతపులిని పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు బోన్లను ఏర్పాటు చేశారు.దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.







