Singer Vani Jayaram: తెలుగు వారికి ఆమె మీద అభిమానం లేదా ? ఈ గంధర్వగాయనికి ఏం తక్కువ ?

తెలుగు వారిని ఎవరిని అడిగిన శాస్త్రీయ సంగీతం మాట వచ్చేసరికి టక్కున గుర్తచ్చే రెండు పేర్లు సుశీల, జానకి … వీరిద్దరూ మంచి గాయనీమణులు అనడంలో ఎలాంటి సందేహం లేదు.పైగా మన తెలుగు వారు కావడం తో వారిపై ఒకింత అభిమానం ఉండటంలో ఎలాంటి తప్పు లేదు.

 Legendary Singer Vani Jayaram Special Story Details, Legendary Singer Vani Jayar-TeluguStop.com

కానీ వీరి సరసన చేరడానికి అన్ని రకాల అర్హతలు ఉన్న కూడా తెలుగు వారి చేత అభిమానాన్ని అదే స్థాయిలో సంపాదించుకోలేక పోయారు గాయని వాణి జయరాం. తెర మంచు కరిగింది తలుపు తీయరా ప్రభు అంటూ పాట పాడుతుంటే ఆ పాట మత్తులో నిద్ర పోనీ వారు ఎవరు ఉండరు అంటే నమ్మాల్సిందే.

స్వాతి కిరణం లో ఆమె పాడిన పాటలు ఎంతో శ్రావ్యంగా ఉంటాయి.ఈ చిత్రం లో ఏకంగా 11 పాటలను ఆమె ఒక్కటే పడటం విశేషం.ఇక మిగిలిన పాటల మెల్ వర్షన్ కావడం తో బాలు చేత పాడించారు.విశ్వనాథ్ తీసిన శంకరాభరణం సినిమా కన్నా కూడా స్వాతి ముత్యం, స్వాతి కిరణం సినిమాల్లో పాటలు కానీ ఆ శాస్త్రీయ సంగీతం అద్భుతంగా ఉంటుందనే అభిప్రాయం చాల మంది చెప్తూ ఉంటారు.

ఆమె తమిళురాలైన కూడా ఏకంగా 19 భాషల్లో పాటల పాడింది.మూడు జాతీయ అవార్డులు అందుకున్న వానమ్మ హిందీ, తెలుగు , కన్నడ, ఇంగ్లీష్, మలయాళం, గుజరాతి, మరాఠీ, బెంగాలీ, ఒడియా, బడగా, ఉర్దూ, సంస్కృతం, రాజస్థానీ, పంజాబీ, తుళు, హర్యాన్వీ వంటి భాషల్లో పాడి అద్భుతమైన రికార్డు ఆమె సొంతం చేసుకుంది.

Telugu Janakri, Legendaryvani, Susheela, Vani Jayaram, Swathi Kiranam-Movie

వేలల్లో భక్తి ఆల్బమ్స్ చేసిన వాణి జయరాం 20 వేలకు పైగా పాటలు పాడింది.సీతాకోక చిలుక సినిమాలో సాగర సంగమమే అంటూ ఆమె పడిన పాట ఇప్పటికి రోజు టీవీల్లో వచ్చిన కూడా మళ్లి మళ్లి వినాలనిపిస్తునే ఉంటుంది.ఇంత మంచి పాటల పాడిన సుశీలమ్మ, జానకమ్మ లకు దక్కిన గౌరవం తమిళనాట పుట్టిన వాణి కి దక్కకపోవడం నిజంగా బాధాకరం.ఆమె అసలు పేరు కళావాణి కాగా, 2018 లో 76 ఏళ్ళ వయసులో అనారోగ్య కారణాలతో కన్ను మూసింది.

నవంబర్ 30 వ తేదీన 80 వ జన్మదినం కాగా, ఆమె లేని లోటు సినిమా ఇండస్ట్రీ లో ఖచితముగా కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube