తెలుగు వారికి ఆమె మీద అభిమానం లేదా ? ఈ గంధర్వగాయనికి ఏం తక్కువ ?

తెలుగు వారిని ఎవరిని అడిగిన శాస్త్రీయ సంగీతం మాట వచ్చేసరికి టక్కున గుర్తచ్చే రెండు పేర్లు సుశీల, జానకి .

వీరిద్దరూ మంచి గాయనీమణులు అనడంలో ఎలాంటి సందేహం లేదు.పైగా మన తెలుగు వారు కావడం తో వారిపై ఒకింత అభిమానం ఉండటంలో ఎలాంటి తప్పు లేదు.

కానీ వీరి సరసన చేరడానికి అన్ని రకాల అర్హతలు ఉన్న కూడా తెలుగు వారి చేత అభిమానాన్ని అదే స్థాయిలో సంపాదించుకోలేక పోయారు గాయని వాణి జయరాం.

తెర మంచు కరిగింది తలుపు తీయరా ప్రభు అంటూ పాట పాడుతుంటే ఆ పాట మత్తులో నిద్ర పోనీ వారు ఎవరు ఉండరు అంటే నమ్మాల్సిందే.

స్వాతి కిరణం లో ఆమె పాడిన పాటలు ఎంతో శ్రావ్యంగా ఉంటాయి.ఈ చిత్రం లో ఏకంగా 11 పాటలను ఆమె ఒక్కటే పడటం విశేషం.

ఇక మిగిలిన పాటల మెల్ వర్షన్ కావడం తో బాలు చేత పాడించారు.

విశ్వనాథ్ తీసిన శంకరాభరణం సినిమా కన్నా కూడా స్వాతి ముత్యం, స్వాతి కిరణం సినిమాల్లో పాటలు కానీ ఆ శాస్త్రీయ సంగీతం అద్భుతంగా ఉంటుందనే అభిప్రాయం చాల మంది చెప్తూ ఉంటారు.

ఆమె తమిళురాలైన కూడా ఏకంగా 19 భాషల్లో పాటల పాడింది.మూడు జాతీయ అవార్డులు అందుకున్న వానమ్మ హిందీ, తెలుగు , కన్నడ, ఇంగ్లీష్, మలయాళం, గుజరాతి, మరాఠీ, బెంగాలీ, ఒడియా, బడగా, ఉర్దూ, సంస్కృతం, రాజస్థానీ, పంజాబీ, తుళు, హర్యాన్వీ వంటి భాషల్లో పాడి అద్భుతమైన రికార్డు ఆమె సొంతం చేసుకుంది.

"""/"/ వేలల్లో భక్తి ఆల్బమ్స్ చేసిన వాణి జయరాం 20 వేలకు పైగా పాటలు పాడింది.

సీతాకోక చిలుక సినిమాలో సాగర సంగమమే అంటూ ఆమె పడిన పాట ఇప్పటికి రోజు టీవీల్లో వచ్చిన కూడా మళ్లి మళ్లి వినాలనిపిస్తునే ఉంటుంది.

ఇంత మంచి పాటల పాడిన సుశీలమ్మ, జానకమ్మ లకు దక్కిన గౌరవం తమిళనాట పుట్టిన వాణి కి దక్కకపోవడం నిజంగా బాధాకరం.

ఆమె అసలు పేరు కళావాణి కాగా, 2018 లో 76 ఏళ్ళ వయసులో అనారోగ్య కారణాలతో కన్ను మూసింది.

నవంబర్ 30 వ తేదీన 80 వ జన్మదినం కాగా, ఆమె లేని లోటు సినిమా ఇండస్ట్రీ లో ఖచితముగా కనిపిస్తుంది.

ఐశ్వర్య మాత్రమేనా…ఇండస్ట్రీలో పెద్దల పిల్లలు అందరూ ఇంతేనా ?