భారత్ బంద్ కు వామపక్షాలు మద్దతు

వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని కనీస మద్దతు ధర కోసం చట్టం చేయాలని జాతీయ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సెప్టెంబర్ 25న చేపట్టిన భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.ఈ మేరకు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.

 Left Parties Support Bharat Bandh-TeluguStop.com

రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి దేబబ్రత బిశ్వాస్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య, సీపీఐ (మార్క్సిస్ట్ -లెనినిస్ట్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపంకార్ భట్టాచార్య సంతకాలతో గురువారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు.మోడీ ప్రభుత్వం అన్నదాతల డిమాండ్ల పరిష్కారానికి ముందుకు రాకపోవడాన్ని ప్రకటన తప్పుబట్టింది.

ఈ విషయంలో కేంద్రం మొండి వైఖరి ఖండించింది.వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కనీస మద్దతు ధర కోసం చట్టబద్ద హామీ ఇవ్వాలని నేషనల్ పైప్ లైన్ లేబర్ కోడ్ లు రద్దు చేయాలని డిమాండ్ చేసింది.

ఈ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 25న తలపెట్టిన భారత బంద్ ను జయప్రదం చేయాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.వామపక్ష పార్టీలకు చెందిన అన్ని ప్రజా సంఘాలు భారత్ బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube