కరోనా వైరస్.ఇది వచ్చాక చాలా మార్పులు వచ్చాయి.
అలానే కరోనా ను తరిమికొట్టే మాస్కులలో కూడా చాల మార్పులు వచ్చాయి.అప్పటివరకు సర్జికల్ మాస్క్ ఒకటే మాస్క్ అనుకునే మనకు ఇప్పుడు రంగు రంగుల మాస్కులు, మాస్క్ షీల్డ్ లు అని వివిధరకాల వచ్చాయి.
కాటన్ మాస్క్ అని ఒకరు అంటే మరొకరు బంగారంతో మాస్క్ చేయించుకున్నవి ఉన్నాయి.
ఇప్పుడు ఇవి అన్ని ఓల్డ్ ఫ్యాషన్.
ఇప్పుడు కొత్తగా మరో మాస్క్ తెరపైకి వచ్చింది.అదే ఎల్ఈడీ మాస్కులు.
అదే రంగురంగుల లైట్లను విరజిమ్ముతున్న “ఎల్ఈడీ మాస్క్” ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చింది.ఇంకా ఈ మాస్క్ ను పశ్చిమ బెంగాల్‌కు చెందిన గౌర్ నాథ్ అనే వ్యక్తి తయారు చేశాడు.
ఇంకా ఈ మాస్క్ వల్ల ఓ ప్రయోజనం ఉంది.ఈ మాస్కు ధరించినవారిని చూస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించే ఎవరికైన సరే మాస్కు పెట్టుకోవాలన్న విషయం గుర్తుకు వస్తుందని అతను చెప్పుకొచ్చాడు.
ఈ విధంగా ఎల్ఈడీ మాస్కు ప్రజల్లో అవగాహనను పెంచుతుందంటున్నాడు గౌర్ నాథ్ .ఇంకా ఈ మాస్క్ కు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.