యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్(RRR) సినిమా తర్వాత తన తదుపరి సినిమాని కొరటాల శివ (Koratala Shiva)దర్శకత్వంలో చేయబోతున్నారు.ఈ సినిమా NTR 30 వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
సముద్రం బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాల రోజు కొరటాల శివ సినిమా గురించి మాట్లాడుతూ తన సినిమాలో మృగాలవేట మామూలుగా ఉండదని చెప్పడంతో ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని అర్థమవుతుంది.

ప్రస్తుతం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు లీకుల బెడద తప్పడం లేదు.సినిమా షూటింగ్ నుంచి ఏ విధమైనటువంటి ఫోటోలు కానీ సన్నివేశాలు కానీ బయటకు రాకుండా ఉండడం కోసం మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న లీకులు మాత్రం ఆగడం లేదు.తాజాగా ఎన్టీఆర్(NTR) సినిమా ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణలోనే ఈ సినిమా నుంచి కొన్ని ఫోటోలు బయటకు లీక్ అవడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఎన్టీఆర్ కు సంబంధించిన లొకేషన్ పిక్స్ (Location pics)సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ ఫోటోలలో ఎన్టీఆర్ కలర్ ఫుల్ డ్రెస్, అదిరిపోయే లుక్ లో కనిపిస్తున్నారు.ఏదో రెస్టారెంట్లో ఊరు నుంచి తనకోసం వచ్చిన పెద్దలతో ఎన్టీఆర్ మాట్లాడుతున్నట్టు ఉంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ కావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఇలా ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ సమయంలోనే లీక్ అవడం సినిమాకు పూర్తిగా డామేజ్ చేస్తుందంటూ మండిపడుతున్నారు.
ఇక ఈ ఘటన పై అలర్ట్ అయినా చిత్ర బృందం ఈ పని ఎవరు చేశారనే విషయంపై ఆరా తీస్తున్నారని, చిత్ర బృందంపై కొరటాల తీవ్రస్థాయిలో మండిపడుతున్నట్టు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తున్న సంగతి తెలిసిందే.







