అప్పుడప్పుడు సెలబ్రిటీలు ఏవైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు అవి కొన్ని సందర్భాలలో వైరల్ అవుతూ ఉంటాయి.అయితే ఇప్పుడు అల్లు స్నేహారెడ్డి( Sneha Reddy ) పంచుకున్న స్టోరీ కూడా అలాగే మారింది.
మామూలుగా ఈ మధ్య స్నేహ రెడ్డిలో మార్పులు చాలా వచ్చాయి.ముఖ్యంగా తన వేషధారణ మాత్రం పూర్తిగా మారిపోయింది.
అయితే తాజాగా ఆమె షేర్ చేసిన స్టోరీకి.ఇప్పుడున్న ఆమె విధానాన్ని చూసి బాగా ట్రోల్ చేస్తున్నారు.
ఇంతకు ఆమె ఏమని పంచుకుందో చూద్దాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న అల్లు అర్జున్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు.
మంచి హోదాలో ఉన్న సమయంలో స్నేహ రెడ్డిని పెళ్లి చేసుకోగా.ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.ఇక స్నేహారెడ్డిని కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు.ఇప్పటివరకు ఆమె ఇండస్ట్రీ పరిచయం చేయలేదు కానీ.
భర్తకున్న హోదా వల్ల ఆమె తన పరిచయాన్ని పెంచుకుంది.

ఇక ఆమె కూడా సోషల్ మీడియా( Social media )లో బాగా యాక్టివ్ గా ఉంటుంది.అల్లు అర్జున్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేస్తూ ఉంటుంది.అంతేకాకుండా పిల్లలకు సంబంధించిన విషయాలను కూడా బాగా పంచుకుంటూ ఉంటుంది.
ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఏ స్టార్ హీరోయిన్ సొంతం చేసుకొని క్రేజ్ ను సోషల్ మీడియా ద్వారా స్నేహ రెడ్డి సొంతం చేసుకుంది.
అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకుంటూ ఉంటుంది.

తన ఫ్రెండ్స్ తో వెళ్లిన ట్రిప్స్ ఫోటోలను, వాళ్ళతో సందడి చేసిన వీడియోలను పంచుకొని అందరి దృష్టిలో పడుతుంది.ఈ మధ్య స్నేహ రెడ్డి అందం విషయంలో కూడా అస్సలు తగ్గట్లేదు.బాగా వర్క్ అవుట్ లు చేస్తూ మంచి ఫిజిక్ ను సంపాదించుకుంటుంది.
అంతేకాకుండా పలు మోడరన్ డ్రెస్సులు వేసుకొని ఫోటో షూట్ లు చేయించుకుంటూ ఆ ఫోటోలను వెంటనే సోషల్ మీడియాలో పెట్టేస్తుంది.

ఏకంగా పొట్టి బట్టలు వేసేసి అందాలను బయటపెడుతుంది.దీంతో చాలామంది ఈమె వేషధారణ పై బాగా విమర్శలు కూడా చేయటం మొదలుపెట్టారు.ఒకప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా మారిపోయావు అంటూ ప్రశ్నలు కూడా వేస్తున్నారు.
ఇక ఇటీవలే అల్లు అర్జున్ బర్త్ డే( Allu Arjun Birthday ) రోజు కూడా తను వేసుకునే డ్రెస్ ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

అందులో కూడా తన అందాలను బయట పెట్టడంతో బాగా విమర్శలు ఎదుర్కొంది.అయితే ఇదంతా పక్కన పెడితే గత ఏడాది ఇదే రోజున ఆమె దిగిన ఒక ఫోటోను స్టోరీ రూపంలో పంచుకుంది.ఇక ఆ ఫోటోలో డోంట్ క్రాస్ ద లైన్ అని కూడా ఉండగా.
ఆ ఫోటో చూసి నెటిజన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.లైన్ క్రాస్ అవ్వద్దని పెట్టి ఇప్పుడు నువ్వే క్రాస్ అయ్యావు కదా అంటూ.
ఆమె డ్రెస్సింగ్ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని కామెంట్లు చేస్తున్నారు.అంటే ఒకప్పుడు ఆమె ఉన్నంతవరకు పద్ధతిగా కనిపించగా.
ఇప్పుడు పూర్తిగా మారిపోవడంతో ఆమెను బాగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.







