యానం సినిమాలో హీరో, హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసిన ప్రముఖ నిర్మాత శరత్ మరార్

విల‌క్ష‌ణ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నిర్మాత‌గా కేఎస్ఐ సినిమా అన్‌లిమిలెట్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతున్న చిత్రం “యానం“.షేక్స్‌పియ‌ర్ ర‌చ‌న‌ల ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ద్వారా క‌రుణాక‌ర‌ణ్ ద‌ర్శ‌కుడిగా పరిచయమవుతున్నాడు.తాజాగా ఈ చిత్రంలో నటించే హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్ లను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రముఖ నిర్మాత శరత్ మరార్, యువ కథానాయకుడు హీరో లక్ష్ చదలవాడ సంయుక్తంగా విడుదల చేశారు.

 Leading Producer Sarath Marar Has Released The First Look Posters Of The Hero An-TeluguStop.com

అనంతరం విలక్షణ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ – ” నా కెరీర్ లో వివిధ దశలలో నాకు ఎంతో సహాయ పడిన నా శ్రేయోభిలాషులకు ధన్యావాదాలు తెలపాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.నేను నిర్మాతగా వ్యవహరిస్తున్న యానం సినిమాలో క్రిష్ పాత్రలో హీరో కళ్యాణ్, మాహీ పాత్రలో హీరోయిన్ రేణుశ్రీ నటిస్తున్నారు.

వీరితో పాటు మరికొంత మంది ప్రముఖ నటీ నటులు కీలక పాత్రలలో నటించనున్నారు.త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం.ఈ కథ తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.ప్రముఖ నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ – “శ్రీకాంత్ అయ్యంగార్ మా బ్యానర్ లో చాలా సినిమాల్లో నటించారు.

ఆయ‌న నాకు చాలా ఏళ్లుగా తెలుసు.అన్ని రకాల పాత్ర‌లు పోషించ‌గ‌ల మంచి నటుడు.

మంచి అవ‌కాశం కోసం ఎన్నో సంవ‌త్స‌రాలు ఎదురుచూశారు.స‌క్సెస్‌ అయ్యారు.

ఆయన నిర్మాతగా వ్యహరిస్తున్న యానం సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.హీరో కళ్యాణ్, హీరోయిన్ రేణుశ్రీ చక్కగా ఉన్నారు.

వారికి ఈ సినిమా ద్వారా మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరో ల‌క్ష్ చ‌ద‌ల‌వాడ మాట్లాడుతూ – `గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుండి శ్రీకాంత్ గారితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది.

ఆ సినిమా కోసం మేం ఇద్ద‌రం చాలా క‌ష్ట‌ప‌డి న‌టించాం.మా ఇద్దరి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ఆ సినిమాకు హైలెట్ అవుతాయి.

చాలా సాఫ్ట్ ప‌ర్స‌న్‌.ఆయ‌న నిర్మాత‌గా తెర‌కెక్కిస్తున్న యానం పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

ద‌ర్శ‌కుడు క‌రుణాక‌ర‌ణ్ మాట్లాడుతూ – ముందుగా నాకు ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం ఇచ్చిన శ్రీ‌కాంత్ అన్న‌కి ధన్య‌వాదాలు.శ్రీ‌కాంత్ గారి ఆలోచ‌న‌ల‌ను త‌ప్ప‌కుండా ముందుకు తీసుకెళ్తాను.

చాలా మందిని ఆడిషన్ చేసి కళ్యాణ్, రేణుశ్రీ లను తీసుకోవడం జరిగింది.త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం“ అన్నారు.

హీరో క‌ళ్యాణ్‌, హీరోయిన్ రేణుశ్రీ మాట్లాడుతూ ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు అన్నారు.

కళ్యాణ్, రేణుశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి.

బ్యానర్: కేఎస్ఐ సినిమా అన్‌లిమిలెట్ నిర్మాత: శ్రీకాంత్ అయ్యంగార్దర్శకత్వం: క‌రుణాక‌ర్‌

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube