టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు.తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడారు.
చంద్రబాబు అరెస్టును సమర్థించిన స్పీకర్ తమ్మినేని క్రిమినల్ ను అరెస్ట్ చేశారన్నారు.ప్రజాధనాన్ని దోచుకున్న ఎంతోమంది రాజకీయ నేతలను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లోనూ టీడీపీ సభ్యులు మితిమీరి ప్రవర్తించారని తెలిపారు.అయితే ఇటువంటి చర్యలను ప్రజలు ఉపేక్షించరని పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఇటీవల మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పిన విధంగా రాజకీయాలు దిగజారిపోయాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.