భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) టైటిల్ తమ ఖాతాలో వేసుకునేందుకు 10 జట్ల ప్లేయర్లు ఇప్పటికే ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యారు.అయితే ఒకవైపు బ్యాటింగ్, మరొకవైపు బౌలింగ్ రెండు స్కిల్స్ తో ఆల్ రౌండర్స్ గా రాణించే ప్లేయర్లు చాల అరుదు.
ఈ అరుదైన ప్లేయర్లే అప్పుడప్పుడు మ్యాచ్లను మలుపు తిప్పడంలో కీలకపాత్రను పోషిస్తుంటారు.అటువంటి ఆటగాళ్లు ఎవరో చూద్దాం.
హర్ధిక్ పాండ్యా:
భారత జట్టులో ఆల్ రౌండర్.ఈ మధ్య జరిగిన ఆసియా కప్ లో వరుసగా బౌలింగ్ చేసిన నాలుగు మ్యాచ్లలోనూ వికెట్లు పడగొట్టాడు.
శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో మూడు పరుగులకే మూడు వికెట్లు తీశాడు.ప్రపంచ కప్ లో హార్థిక్ పాండ్యా( Hardik Pandya ) బ్యాటింగ్, బౌలింగ్ జట్టుకు ఎంతో కీలకం.
రవీంద్ర జడేజా:
భారత జట్టులో ఆల్ రౌండర్. ఆసియా కప్ లో ఆరు వికెట్లు తీసి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.
ఇటీవలే ఆస్ట్రేలియా తో జరిగిన రెండో వన్డేలో మూడు వికెట్లతో అదరగొట్టాడు.ప్రపంచ కప్ మ్యాచ్లలో ఇతని బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ జట్టుకు ఎంతో అవసరం.

షకీబ్ అల్ హసన్:
బంగ్లాదేశ్ జట్టులో ఆల్రౌండర్.వన్డేలలో షకీబ్( Shakib Al Hasan ) బ్యాటింగ్, బౌలింగ్ సగటు 38,29 గా ఉంది.బంగ్లాదేశ్ జట్టు సెమిస్ చేరుతుందో లేదో తెలియదు కానీ బంగ్లాదేశ్ విజయాలలో ఇతని పాత్ర కచ్చితంగా ఉంటుంది.

లివింగ్ స్టన్:
ఇంగ్లాండ్ జట్టులో ఆల్రౌండర్.ఇతను క్రీజులో నిలదొక్కుకొని నిలబడితే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు.ఇతను ఆఫ్ స్పిన్నర్.
ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో దిట్ట.
ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జట్టులోను కీలకమైన ఆల్రౌండర్లు ఉన్నారు.
ఇంగ్లాండ్ జట్టులో మరో ఆల్ రౌండర్ మొయిన్ అలీ, పాకిస్తాన్ జట్టులో ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్.న్యూజిలాండ్ జట్టులో ఆల్రౌండర్లు రచిన్ రవీంద్ర, జిమ్మీ నీషమ్, డరైల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ ఉన్నారు.
ఇక ఆస్ట్రేలియా జట్టు విషయానికి వస్తే.మిచెల్ మార్ష్ ఆల్ రౌండర్ గా ఉన్నాడు.
ఈ కీలక ఆటగాళ్లకు మ్యాచ్ ను మలుపు తిప్పే సత్తాను కలిగి ఉన్నారు.