సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో నిజాలకు నేను సాక్ష్యం అని తెలిపారు.నేను, సీనియర్ ఎన్టీఆర్ నిజాల్లో బ్రతికామని ఆమె కామెంట్లు చేశారు.
ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత నాపై ఒక సినిమా తీశారని ఆమె పేర్కొన్నారు.తప్పులు చేసేవాళ్లు దొరికిపోకుండా ఉండాలని భావిస్తారని లక్ష్మీపార్వతి తెలిపారు.
నందమూరి కుటుంబంలో చోటు చేసుకున్న విషాదాలు నన్ను బాధ పెట్టాయని ఆమె పేర్కొన్నారు.
తారకరత్న విషయంలో మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని లక్ష్మీపార్వతి తెలిపారు.
ఆస్పత్రి బిల్లులను విజయసాయిరెడ్డి పే చేశారని ఆమె అన్నారు.తారకరత్న పిల్లలకు న్యాయం చేస్తే బాగుంటుందని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.
మోహనకృష్ణ కుటుంబంతో నాకు మాటలు లేవని ఆమె పేర్కొన్నారు.వ్యక్తిగతంగా మోహనకృష్ణ మంచి వ్యక్తి అని ఆమె వెల్లడించడం గమనార్హం.

సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలోనే ఆస్తులను పిల్లల పేర్లపై రాసేశారని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.అందానికి రంగు ముఖ్యం కాదని ఆమె తెలిపారు.లోకేశ్ అల్ప జంతువు అని ప్రజలందరికీ వాస్తవం అర్థమైందని లక్ష్మీపార్వతి వెల్లడించారు.నన్ను ఎన్టీఆర్ కొన్నిసార్లు తిట్టేవారని ఆమె పేర్కొన్నారు.జూనియర్ ఎన్టీఆర్ కు పూర్తిస్థాయిలో పార్టీ పగ్గాలు ఇవ్వడం సాధ్యం కాదని ఆమె కామెంట్లు చేశారు.

జనసేనకు రూపకర్త చంద్రబాబు అని లక్ష్మీపార్వతి తెలిపారు.జనసేన ఎక్కడుందో అక్కడే ఉందని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు.వారాహి వాహనాన్ని షూట్ కోసం వాడుతున్నారని ఆమె తెలిపారు.
అన్ స్టాపబుల్ షోకు పిలిస్తే వెళ్తారా అనే ప్రశ్నకు కచ్చితంగా వెళ్తానని లక్ష్మీపార్వతి కామెంట్లు చేశారు.బాలయ్య ధైర్యం చేసి పిలిస్తే ఏం జరిగిందో సాక్ష్యాలతో సహా నేను చెబుతానని బాలయ్యకు అంత ధైర్యం ఉందా అంటూ లక్ష్మీపార్వతి ప్రశ్నించారు.
లక్ష్మీపార్వతి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.