మళ్ళీ లక్ష్మి బాంబ్ కి ఫిక్స్ అయిన రాఘవ లారెన్స్! ఒప్పించిన అక్షయ్ కుమార్

లారెన్స్ హీరోగా తమిళంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం కంచన, మునికి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా లారెన్స్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.అతని దర్శకత్వంలోనే తెరకెక్కిన ఈ సినిమా అతను కంచన సిరిస్ తీయడానికి కూడా ఛాన్స్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే కాంచన సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా హిందీలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా లో అక్షయ్ కి జోడీగా కైరా అద్వానీ హీరోయిన్ గా చేస్తుంది.

ఇదిలా ఉంటే ఆ మధ్య లక్ష్మి బాంబ్ నుంచి అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.అయితే ఆ ఫస్ట్ లుక్ తన ప్రమేయం లేకుండా విడుదల చేసారని హార్ట్ అయిన లారెన్స్ తాను ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నా అని ప్రకటించాడు.

ఇదిలా ఉంటే తాజాగా మళ్ళీ తెర ముందుకి వచ్చిన లారెన్స్ లక్ష్మి బాంబ్ సినిమా తాను చేస్తున్నానని, తనకి రెస్పెక్ట్ ఇచ్చి గౌరవం కాపాడిన అక్షయ్ కుమార్ కి థాంక్స్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.ఇదిలా ఉంటే లారెన్స్ నిర్మాతల కారణంగా భాగా హార్ట్ అవడంతో అక్షయ్ కుమార్ రంగంలోకి దిగి అతనిని కూల్ చేసినట్లు తెలుస్తుంది.

దీంతో నిర్మాతలు, దర్శకులు లారెన్స్ మధ్య వివాదం సద్దుమణిగి సినిమా తెరపైకి వెళ్తుంది అని బాలీవుడ్ లో వినిపిస్తుంది.మొత్తానికి లక్ష్మి బాంబ్ వివాదం స్టార్ట్ చేసిన లారెన్స్ మళ్ళీ దానికి ఫుల్ స్టాప్ పెట్టేసాడు అనే ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?

తాజా వార్తలు