భారతీయుడు సీక్వెల్ కి భై భై చెప్పేసిన కాజల్! అసలు కారణం అదే

సౌత్ ఇండియా దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో రెండు కమల్ హాసన్ హీరోగా వచ్చిన భారతీయుడు సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది.

ఇక ఆ సినిమా స్ఫూర్తితో తెలుగు, తమిళ భాషల్లో చాల సినిమాలు వచ్చాయి.

అయిన ఇప్పటికి ఆ సినిమా ట్రెండ్ సెట్టర్ గానే ఉంది.ఇదిలా ఉంటే భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా కొన్ని నెలల క్రితం శంకర్, కమల్ హసన్ మళ్ళీ భారతీయుడు 2 మొదలెట్టారు.

ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించడానికి రంగం సిద్ధం అయ్యింది.ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని దర్శకుడు శంకర్ తీసుకున్నాడు.

ఇక ఈ సినిమా కోసం కాజల్ యుద్ధ కళని కూడా నేర్చుకుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రారంభమైన కొద్ది రోజులలోనే మళ్ళీ ఆగిపోయింది.

Advertisement

నిర్మాతలు, దర్శకుడు మధ్య తలెత్తిన ఆర్ధికపరమైన విభేదాల కారణంగా సినిమా షూటింగ్ ముందుకి వెళ్ళలేదు.ఇంతలో కమల్ హసన్ పార్టీ పెట్టి రాజకీయంగా బిజీ కావడంతో ఇక శంకర్ కూడా సినిమాని ముందుకి తీసుకెళ్ల లేకపోయాడు.

ఈ నేపధ్యంలో భారతీయుడు 2 సినిమా స్టార్ట్ అవుతుంది అని చెబుతున్న ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది అర్ధం కాని ప్రశ్నగా ఉండిపోయింది.ఈ నేపధ్యంలో తాజాగా ఇందులో హీరోయిన్ గా చేస్తున్న కాజల్ అగర్వాల్ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ ఎప్పుడు మొదలు అవుతుందో తెలియని ఆ సినిమా కోసం వస్తున్న ఆఫర్స్ ని వదులుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు