లావణ్యత్రిపాఠికి అలాంటి రోల్స్ లో నటించొద్దని భర్త సూచించారా.. ఆమె ఏమన్నారంటే?

తెలుగులో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించినా లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) సక్సెస్ రేట్ తక్కువేననే సంగతి తెలిసిందే.లావణ్య త్రిపాఠికి పెళ్లి తర్వాత కూడా క్రేజ్, పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు.

 Lavanya Tripathi Comments About Movie Roles Details Here Goes Viral In Social Me-TeluguStop.com

ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే ఛాన్స్ ఇవ్వడానికి దర్శకనిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.అయితే లావణ్య త్రిపాఠి పెళ్లి సమయంలో అత్తింటి వాళ్లు ఎన్నో షరతులు పెట్టారని వార్తలు వినిపించడం గమనార్హం.

తాజాగా ఆ ప్రచారం గురించి లావణ్య త్రిపాఠి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సినిమాలు, వెబ్ సిరీస్ ( Movies, web series )లనే తేడా లేదని నచ్చినవి ఎంచుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తానని లావణ్య త్రిపాఠి పేర్కొన్నారు.

మిస్ వెబ్ సిరీస్ తో పాటు రెండు సినిమాలలో నటిస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు.మెగా కోడలు అనే ట్యాగ్ వల్ల నాపై బాధ్యతలు పెరిగాయని లావణ్య త్రిపాఠి అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

Telugu Varun Tej, Web-Movie

పెళ్లి తర్వాత సినిమాలు, రోల్స్ విషయంలో అత్తింటి వైపు నుంచి ఎలాంటి షరతులు లేవని లావణ్య అన్నారు.నా భర్త కూడా ఇలాంటి పాత్రలే చేయాలని ఎలాంటి షరతులు పెట్టలేదని ఆమె పేర్కొన్నారు.అయితే నాకంటూ కొన్ని హద్దులు ఉన్నాయని ఆ హద్దులను అవి మాత్రం పాటిస్తానని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చారు.లావణ్య త్రిపాఠి రెమ్యునరేషన్ సైతం పరిమితంగా ఉందని తెలుస్తోంది.

Telugu Varun Tej, Web-Movie

భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో లావణ్య త్రిపాఠి కచ్చితంగా విజయాలను సొంతం చేసుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.లావణ్య సినిమాలలో నటిస్తానని చెప్పడంలో వరుణ్ తేజ్ ( Varun Tej )లావణ్యల కాంబోను మరోసారి సిల్వర్ స్క్రీన్ పై చూసే ఛాన్స్ కూడా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.లావణ్య త్రిపాఠి రేంజ్ అంతకంతకూ పెరగాలని సక్సెస్ రేట్ కూడా మరింత పెరగాలని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.లావణ్య క్రేజ్ ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube