వ్యవసాయంలో తక్కువ పెట్టుబడి వ్యయంతో అధిక దిగుబడులు ఇచ్చే పంటలు వేస్తేనే ఆశించిన స్థాయిలో లాభాలు అర్జించవచ్చు.ఈ క్రమంలో కొంతమంది రైతులు అండు కొర్రలు సాగు చేసి అధిక దిగుబడులు సాధిస్తున్నారు.
ఒక ఎకరం పొలంలో దాదాపుగా 10 క్వింటాళ్ల దిగుబడులు పొందుతున్నారు.
మేలు రకం అండు కొర్ర( Andu Korralu ) విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేపట్టాలి.పంటకాలం 90-100 రోజులు.సాధారణంగా ఏ పంటను సాగు చేసిన కోతల తర్వాత మళ్లీ దుక్కి చేసి, మళ్లీ విత్తనాలు నాటాల్సిందే.
కానీ అండు కొర్రలను ఒకసారి విత్తితే ఏకంగా వరుసగా నాలుగు పంటలు పొందవచ్చు.
ఈ అండు కొర్ర పంటను జూలై చివరివారం లేదంటే ఆగస్టు మొదటి వారంలో విత్తుకుంటే అక్టోబర్ నెలలో పంట చేతికి వస్తుంది.ఇక నవంబర్ నెలలో దుక్కి చేసి వదిలేస్తే.నేల రాలిన అండు కొర్ర విత్తనాలు మొలకెత్తుతాయి.
నీటి తడి అందిస్తే అన్ని విత్తనాలు మొలకెత్తుతాయి.పైగా కలుపు సమస్య( Weed problems ) కూడా చాలా తక్కువ.
కలుపు మొక్కల కంటే అండు కొర్ర మొక్కలు వేగంగా పెరుగుతాయి.ఇలా వరుసగా ఏకంగా నాలుగు పంటలు పొందవచ్చు.
అండు కొర్రల పంట వేసే ముందు పొలాన్ని దుక్కి చేసి పొలంలో గొర్రెలను ఆపాలి.గొర్రెల మలమూత్రాల వల్ల పొలం సారవంతం అవుతుంది.
ఆ తర్వాత పొలాన్ని కలిగి ఉండాలి.మొక్కల వరుసల మధ్య 15 అంగుళాలు ఉండే విధంగా ట్రాక్టర్ గోర్రుతో ఒక ఎకరానికి ఐదు కిలోల చొప్పున విత్తనాలను విత్తాలి.
పంట కోతల అనంతరం రోటవేటర్ తో నేలను కలియదున్ని ఒక నీటి తడి అందించాలి.పైగా ఈ పంటకు చీడపీడల, తెగుళ్ల బెడద కూడా చాలా తక్కువ.
ఎలాంటి పిచికారి మందులు ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.