యంగ్ హీరో నిఖిల్ నటించిన రీసెంట్ మూవీ ‘అర్జున్ సురవరం’ వరుస వాయిదాల తరువాత ఎట్టకేలకు నవంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.ఈ సినిమాకు తొలి షోకే మంచి టాక్ రావడంతో రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి.
ఈ సినిమాతో నిఖిల్ మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడంటూ వార్తలు షికారు చేశాయి.ఇప్పుడు అదే వార్త నిజమైంది.
అర్జున్ సురవరం రిలీజయిన రెండు వారాలు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.9.54 కోట్ల కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.6 కోట్లకు అమ్ముడుకావడంత ఈ సినిమా రెండు వారాలు ముగిసే సరికి లాభాలు తెచ్చిపెట్టిందని చిత్ర యూనిట్ తెలిపింది.ఇక ఈ సినిమాతో నిఖిల్, లావణ్య త్రిపాఠీలకు పెద్ద రిలీఫ్ దొరికిందని చెప్పాలి.
అర్జున్ సురవరం చిత్రం రెండు వారాలు ముగిసే సరికి ఏరియాల వారీగా కలెక్ట్ చేసిన కలెక్షన్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.
ఏరియా – రెండు వారాల కలెక్షన్స్
నైజాం – 3.62 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.02 కోట్లు
సీడెడ్ – 0.90 కోట్లు
ఈస్ట్ గోదావరి – 0.57 కోట్లు
గుంటూరు – 0.69 కోట్లు
వెస్ట్ గోదావరి – 0.49 కోట్లు
కృష్ణ – 0.65 కోట్లు
నెల్లూరు – 0.42 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 8.36 కోట్లు
కర్ణాటక మరియ రెస్టాఫ్ ఇండియా – 0.55 కోట్లు
ఓవర్సీస్ – 0.63 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – 9.54 కోట్లు