సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాలోయింగ్ గురించి తెలియని ప్రేక్షకులు లేరు.ఈయన 47 ఏళ్ల వయసులో కూడా హ్యాండ్సమ్ యంగ్ అండ్ చార్మింగ్ లుక్ తో యువతను మాయ చేయడంలో ముందు వరుసలో ఉన్నాడు.
అంతలా తన కొత్త కొత్త స్టైలిష్ లుక్ తో ఈయన మెస్మరైజ్ చేస్తాడు.ఈయనకు పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న కూడా ఇప్పటికి యువతుల కళల రాకుమారుడిగా కీర్తించ బడుతున్నాడు.
అందుకే ఈయనకు మన టాలీవుడ్ లో మాత్రమే కాదు.ప్రపంచ వ్యాప్తంగా ఎవర్ గ్రీన్ చార్మింగ్ హీరోగా ఫ్యాన్స్ చేత జేజేలు కొట్టించు కుంటున్నాడు.ఈయన ఏజ్ పెరుగుతున్న అందం మాత్రం తగ్గడం లేదు.ఇటీవలే మహేష్ బాబు కొత్త ఫోటో ఒకటి వైరల్ అయ్యింది.
ఈ ఫొటోలో మహేష్ కొద్దిగా గడ్డం పెంచి లైట్ బియర్డ్ తో కొత్త హెయిర్ స్టైల్ తో ఆకట్టుకునే లుక్ లో చాలా స్టైలిష్ గా కనిపించగా ఆ ఫోటో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
ఇక ఇప్పుడు మహేష్ మరో స్టైలిష్ పిక్ బయటకు వచ్చింది.
మహేష్ చేయబోతున్న త్రివిక్రమ్ సినిమా కోసం ఈయన ఫిట్ నెస్ మీద ద్రుష్టి పెట్టాడు.ఈ క్రమంలోనే ఈ రోజు సెలెబ్రిటీ ఫిట్ నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ తన సోషల్ మీడియాలో మహేష్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేయగా మరో పిక్ బయటకు వచ్చింది.
ఈ లుక్ ముందు కంటే మరింత బాగుంది.

మహేష్ సరికొత్త లుక్ చూసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఇటీవలే గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.మహేష్ బాబు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.ఈ సినిమా ఆగష్టు నెలలో సెట్స్ మీదకు వెళ్లనుందని మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.
11 ఏళ్ల తర్వాత వీరి కలయికలో సినిమా రాబోతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.