తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో విజయేంద్రప్రసాద్(Vijayendra Prasad) ఒకరు ఈయన ఎన్నో అద్భుతమైన సినిమా కథలను సిద్ధం చేసి బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకున్నారు.ఈయన స్వయాన రాజమౌళికి( Rajamouli ) తండ్రి అనే విషయం మనకు తెలిసిందే.
ఇలా రాజమౌళి చేసే సినిమాలన్నింటికీ కూడా విజయేంద్ర ప్రసాద్ కథలను అందిస్తూ ఉంటారు.ఇక విజయేంద్ర ప్రసాద్ రాసిన RRR సినిమా కథకు గాను ఏకంగా ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు అంటే ఆ సినిమా పక్క హిట్ అవుతుంది.ఈ విధంగా విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చినటువంటి ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ అందుకున్నాయి.
ఇక త్వరలోనే వీరి కాంబినేషన్లో మహేష్ బాబు హీరోగా నటించబోతున్న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక తన కుమారుడు డైరెక్టర్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎంతో మంచి గుర్తింపు పొందారు ఇలా ఒక కొడుకు ఎదుగుదలను చూసి ప్రతి ఒక్క తండ్రి ఎంతో గర్వపడుతూ ఉంటారు.
కానీ రాజమౌళి విషయంలో విజయేంద్ర ప్రసాద్ కు ఆ విధమైనటువంటి ఆలోచన లేదని తెలుస్తుంది తన కుమారుడు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డు( Oscar Award ) రావడానికి కూడా మూల కారణమైనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని కాకుండా విజయేంద్ర ప్రసాద్ మరొక డైరెక్టర్ ను ఇష్టపడటం గమనార్హం.మరి రాజమౌళిని కాకుండా విజయేంద్ర ప్రసాద్ అంతగా ఇష్టపడే డైరెక్టర్ ఎవరు అనే విషయానికి వస్తే ఆయనే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannath) .పూరి జగన్నాథ్ సినిమాలు చేసే టెక్నిక్ విజయేంద్రప్రసాద్ కి అమితంగా నచ్చుతాయుట.
ఆయన సినిమా చేసే విధానం, డైలాగ్స్ , అలాగే సినిమా టైటిల్స్ కూడా తనని ఎంతగానో ఆకట్టుకుంటాయని ఒక ఇంటర్వ్యూ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ పూరి జగన్నాథ్ గురించి తెలియజేశారు.అందుకే తనకు పూరి జగన్నాథ్ అంటే చాలా ఇష్టమని ఈయన వెల్లడించారు.అంతేకాకుండా తన ఫోన్ వాల్ పేపర్ కూడా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఫోటో పెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు.
ఒక సినీ రచయిత ఫోన్ వాల్ పేపర్ గా పూరి జగన్నాథ్ ఫోటో ఉండడం నిజంగా గ్రేట్ అయితే తన కుమారుడు అంత పెద్ద డైరెక్టర్ అయినప్పటికీ తన ఫోటో కాకుండా పూరి జగన్నాథ్ ఫోటో పెట్టుకోవడం అంటే ఇది నిజంగానే పూరి జగన్నాథ్ కి గర్వకారణమైనప్పటికీ రాజమౌళి(Rajamouli) కి అవమానమే అని చెప్పాలి.
ఇక పూరి జగన్నాథ్ కూడా కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో కష్టపడుతూ ఈయన ఎంతో మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరికీ కూడా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ఘనత పూరి జగన్నాథ్ కి ఉంది.ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ పలు ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొంటున్నారు కానీ ఒకానొక సమయంలో ఈయన కూడా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు.
ఇలా పూరి జగన్నాథ్ గురించి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.