బర్త్ డే కి డెత్ డే కి తేడా తెలియదా హైపర్ ఆది అంటున్న నెటిజన్లు....

టాలీవుడ్ జబర్దస్త్ కామెడీ షో ద్వారా వెండితెరకు పరిచయమైన  హైపర్ ఆది గురించి చెప్పనవసరం లేదు.

ఇతడు తన స్కిట్ లో పేల్చే పంచులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

 అయితే తాజాగా హైపర్ ఆది చేసినటువంటి  ఓ చిన్న తప్పిదం వల్ల అతడినీ నెటిజన్లు ఏకి పారేస్తున్నారు.తాజాగా ప్రముఖ కమెడియన్ స్వర్గీయ ఎమ్మెస్ నారాయణ వర్ధంతికి హైపర్ ఆది హ్యాపీ బర్త్ డే సార్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

దీంతో ఈ పోస్టు చేసినటువంటి కొందరు నెటిజన్లు హైపర్ ఆది ని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.అంతేగాక ఒక కమీడియన్ అయ్యుండి మరొక లెజెండరీ కమెడియన్ వర్ధంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ఏంటని కామెంట్ చేస్తున్నారు.

అయితే ఈ పోస్ట్ ని హైపర్ ఆది పోస్ట్ చేసిన రెండు గంటల తర్వాత మార్చి మళ్లీ పోస్ట్ చేశారు.కానీ అప్పటికే హైపర్ ఆది ఎప్పుడు ఎప్పుడు దొరుకుతాడా ఎదురుచూస్తున్న కొందరు వ్యక్తులు హైపర్ ఆది పెట్టినటువంటి ఆ పోస్ట్ ని స్క్రీన్ షాట్ తీసుకొని నెట్టింట్లో బాగానే వైరల్ చేస్తున్నారు.

Advertisement

దీంతో ప్రస్తుతం హైపర్ ఆది నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

అయితే ఇది ఇలా ఉండగా హైపర్ ఆది ప్రస్తుతం పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో కమెడియన్ గా నటిస్తున్నాడు.అంతేగాక రాజకీయాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తన సపోర్ట్ అందిస్తూ తనవంతు సాయం చేస్తున్నాడు.అయితే  నెట్టింట్లో ట్రోల్స్ చేసే వాళ్ళలో హైపర్ ఆది నెగిటివ్ అభిమానులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు