త్రిప్తీ డిమ్రీ( Tripty Dimry ).ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకువచ్చే సినిమా యానిమల్( Animal ).
రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమాలో కీలకపాత్రలో నటించింది త్రిప్తీ డిమ్రీ.
ఈ సినిమా విడుదల తర్వాత ఈమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంది.ముఖ్యంగా ఈ సినిమాలో తన అద్భుతమైన నటనకు మంచి ప్రశంసలు అందుకుంది.
ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా మరింత పెరిగింది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు 4.9 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు.

ఇకపోతే ఈమె శృంగార సన్నివేశంలో నటించడంపై తల్లిదండ్రులు( parents ) ఏ విధంగా రియాక్ట్ అయ్యారు ఏమన్నారు అన్న విషయంపై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పందించింది.కాగా ఈ సందర్బంగా త్రిప్తీ డిమ్రీ మాట్లాడుతూ.సినిమా పరిశ్రమ గురించి ఏమీ తెలియని వ్యక్తులు, సెట్స్ లో పని ఎలా ఉంటుందో తెలియని వ్యక్తులు, వారి ఊహ మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకువెళతాయి.
అందుకే నా తల్లిదండ్రులను కొంచెం దిగ్భ్రాంతికి గురయ్యారు అని ఆమె తెలిపింది.సినిమాల్లో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదని ఆమె తల్లిదండ్రులు చెప్పారట.

ఆ సీన్‌ని అర్థం చేసుకోవడానికి వారికి కొంత సమయం పట్టిందని, అవి వాళ్లకు చాలా మధురంగా ఉన్నాయన్నారని తెలిపింది త్రిప్తీ డిమ్రీ.నేను ఏ తప్పు చేయడం లేదు.ఇది నా వృత్తి.నేను సుఖంగా ఉన్నంత వరకు నేను సురక్షితంగా ఉన్నానని నాకు తెలిసినంత వరకు, దానిలో నాకు ఎటువంటి సమస్య కనిపించదు.నేను నటిని 100 శాతం నిజాయితీగా ఉండాలి.నేను పోషించే ప్రతి పాత్రకు నేను న్యాయం చేశాను అంతే అని చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కాగా యానిమల్ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అవకాశాలు క్యూ కడుతున్నాయి.







