బిగ్బాస్ ఫేమ్, యూట్యూబర్ షణ్ముక్( Shanmukh Jaswanth ) గంజాయితో పట్టుబడ్డారు.ఓ కేసులో షణ్ముక్ సోదరుడు సంపత్ కోసం పోలీసులు అతని ఫ్లాట్ కు వెళ్లారు.
ఈ క్రమంలోనే సంపత్, షణ్ముఖ్ గంజాయితో పోలీసులకు పట్టుబడ్డారని తెలుస్తోంది.

ప్రస్తుతం వీరిద్దరూ హైదరాబాద్ లోని నార్సింగి పోలీసుల అదుపులో ఉన్నారు.అయితే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధం అయ్యాడంటూ షణ్ముక్ సోదరుడు సంపత్( Sampath ) పై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.కేసు దర్యాప్తులో భాగంగా అతని ఫ్లాట్ కు వెళ్లిన పోలీసులకు షణ్ముఖ్ గంజాయితో దొరికాడని సమాచారం.







