Kota Srinivasa Rao: డాక్టర్ కావాల్సిన కోట శ్రీనివాస్ యాక్టర్ ఎలా అయ్యారు ఆయన ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్లకు విలన్ పాత్రలకు కూడా ఎంతో డిమాండ్ ఉందనే విషయం మనకు తెలిసిందే ఇలా కమెడియన్స్ విలన్ పాత్రల ద్వారా కూడా కొన్ని సినిమాలు సంచలనమైనటువంటి విజయాన్ని అందుకున్నాయి అంటే కూడా అతిశయోక్తి లేదు.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) ఒకరు.

ఈయన అద్భుతమైన విలక్షణ నటుడిగా ఇండస్ట్రీలో నటించే పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు.ఇక ప్రస్తుతం ఈయనకు వయస్సు పై పడటంతో పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

ఇలా సినిమా ఇండస్ట్రీలకు దూరంగా ఉన్నటువంటి కోటా శ్రీనివాసరావు పలు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన సినిమా కెరియర్ కు సంబంధించిన విషయాలన్నింటిని కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.ఇలా సినీ కెరియర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో అద్భుతమైన పాత్రలలో నటించారు.

అయితే ఈయన యాక్టర్ గా కాకుండా డాక్టర్( Doctor )కావలసి ఉండేదని డాక్టర్ చదువును మధ్యలో ఆపి సినిమాలపై ఆసక్తితో సినిమాలలోకి వచ్చారని తెలుస్తోంది.

Advertisement

కోటా శ్రీనివాసరావు తండ్రికి ఏడుగురు సంతానం.కోటా శ్రీనివాసరావు తండ్రి(Kota Srinivasa Rao Father) వృత్తిపరంగా వైద్యుడు కావడంతో తన పిల్లలని కూడా డాక్టర్ చేయాలని భావించారట.ఈ క్రమంలోనే తన పెద్ద కుమారుడిని డాక్టర్ చదవమని చెప్పగా ఆయనకు ఇష్టం లేక నాటకాలలోకి వెళ్లారు ఇక చిన్న కొడుకు కోట శ్రీనివాసరావును డాక్టర్ చేయాలని పట్టుబట్టారు.

దీంతో ఈయన మెడికల్ కాలేజీలో( Medical College ) చదివారు అయితే ఒకసారి ఇంటికి రాగా తన అన్నయ్య నాటకాలలో ఎంతో గొప్పగా నటించడంతో అందరూ తనని పొగడడం మొదలుపెట్టారట.ఇలా తన అన్నయ్యను పొగుడుతూ ఉంటే ఎలాగైనా నేను కూడా నాటకాలలోకి వెళ్ళాలి అని భావించి తన అన్న దగ్గర నటనలో మెలకువలు నేర్చుకొని ఈయన కూడా పలు నాటకాలు వేశారని తెలుస్తుంది.

ఇలా నాటకాలు వేసినటువంటి ఈయనని చూసి చిరంజీవి( Chiranjeevi ) హీరోగా నటించిన ప్రాణం ఖరీదు సినిమాలో( Pranam Khareedu ) ఈయనకు అవకాశం ఇచ్చారు.అయితే అప్పటికే డాక్టర్ చదువు మధ్యలో ఆపివేసినటువంటి ఈయన తిరిగి డిగ్రీ చేరి ఒకవైపు సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు డిగ్రీ పూర్తి చేశారు.ఇలా డిగ్రీ పూర్తి చేసినటువంటి కోట శ్రీనివాసరావు బ్యాంకు ఉద్యోగం కూడా సంపాదించారు.

ఇలా ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి ఈయన కొన్ని రోజులపాటు సెలవులు పెట్టి సినిమా షూటింగ్లలో కూడా నటించేవారు అయితే ఈయనకు ప్రతిఘటన సినిమా ( Pratighatana ) తన కెరీయర్ని మార్చేసిందని చెప్పాలి.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

ఈ సినిమా మంచి హిట్ కావడమే కాకుండా కోటా శ్రీనివాసరావు పాత్రకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు రావడంతో ఈయనకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.ఇలా సినిమా అవకాశాలు రావడంతో తన బ్యాంక్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి పూర్తిగా ఇండస్ట్రీలోనే స్థిరపడ్డారు ఇక ప్రాణం ఖరీదు(Pranam Khareedu) సినిమా ఈయనకు మొట్టమొదటి సినిమా ఈ సినిమా క్లైమాక్స్ లో గుంపులో ఒక వ్యక్తిగా కోటా శ్రీనివాసరావు కనిపిస్తారు.ఇలా ఈ పాత్రలో కనిపించినందుకు ఈయనకు వంద రూపాయల రెమ్యూనరేషన్(Hundred Rupees Remuneration) ఇచ్చారట ఇదే కోటా శ్రీనివాసరావు గారి ఫస్ట్ రెమ్యూనరేషన్ అని తెలుస్తుంది.

Advertisement

తదుపరి ఈయనకు వరుసగా సినిమా అవకాశాలు రావడంతో తన రెమ్యూనరేషన్ కూడా పెరిగిందని తెలుస్తోంది.

తాజా వార్తలు