తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సీనియర్ నటుడు చంద్రమోహన్ ( Chandra Mohan ) గత రెండు రోజుల క్రితం మరణించిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈయన మరణం తర్వాత ఈయనకు సంబంధించిన ఎన్నో ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి చంద్రమోహన్ తన పిల్లలను ఎందుకు ఇండస్ట్రీకి తీసుకురాలేదనే విషయాలను వెల్లడించారు.ముందుగా ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు ఇండస్ట్రీలో కొనసాగుతూ కొన్ని కోట్ల రూపాయలను సంపాదించి చివరికి అనాధలుగా చనిపోయిన వారు ఉన్నారు అలా కావడానికి కారణం తమ పిల్లలను గారాబం చేయడమేనని చంద్రమోహన్ తెలిపారు.
పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్ తో పుట్టడం వారు అడిగిన వాటికి కాదనకుండా డబ్బులు అందించడంతోనే సదరు సెలబ్రిటీలు చివరికి ఏ మాత్రం డబ్బు లేకుండా ఎంతో ఇబ్బందులు పడ్డారని చంద్రమోహన్ తెలిపారు అదృష్టవశాత్తు నాకు కొడుకులు లేరు అంటూ ఈయన సంబరం వ్యక్తం చేశారు.ఇక తనకి ఇద్దరు కూతుర్లు ( Chandra Mohan daughters )ఉన్న వారికి సినిమాల పట్ల ఏమాత్రం అవగాహన లేదని వారిని నేను సినిమాలకు దూరం పెట్టానని చంద్రమోహన్ తెలిపారు.ఎప్పుడైనా వారిని షూటింగ్ కి తీసుకెళ్ళినప్పుడు మీ అమ్మాయి బాగుంది కదా చైల్డ్ ఆర్టిస్ట్ గా తీసుకుందామని అడిగినా నేను వద్దనే చెప్పేవాడిని.
ఇలా మా ఇద్దరమ్మాయిలను చిన్నప్పటినుంచి ఇండస్ట్రీకి దూరం పెట్టడం వల్ల వాళ్లు సినిమాలలోకి రాలేదని తెలిపారు.ఇక ఈయన ఎన్నో సినిమాలలో హీరోగా నటించారు.అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు.
ఇలా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నటువంటి ఈయన చివరి వరకు కేవలం సినిమా ఇండస్ట్రీకి మాత్రమే సేవలు చేశారు.ప్రస్తుత కాలంలో హీరోలు హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అయిన తర్వాత వెంటనే ఇతర వ్యాపార రంగాలలోకి రాజకీయాలలోకి ( Politics )వెళ్తూ ఉన్నారు.
అయితే ఈయనతో పాటు హీరోలుగా చేసిన వారందరూ కూడా రాజకీయాలలోకి వచ్చారు.
ఇదే విషయం గురించి చంద్రమోహన్ కి ప్రశ్న ఎదురైంది మీరు ఎందుకని రాజకీయాలలోకి రాలేదు అని ప్రశ్నించగా చంద్రమోహన్ తన డైరీలో రాజకీయాలు క్రీడారంగం వ్యాపార రంగం ఈ మూడింటికి చోటు లేదని ఈయన తెలియజేశారు.నాకు సినిమాలే ఆసక్తి చేస్తే సినిమాలు చేయాలి లేదా ఇంటిపట్టునే ఉండి ఎన్నో తన పిల్లలతో సంతోషంగా గడపడానికి ఇష్టపడతానే తప్ప ఇతర రంగాలలోకి వెళ్లడానికి తనకు ఏమాత్రం ఇష్టం లేదని చంద్రమోహన్ తెలిపారు.అందుకే నా జీవిత డైరీలో ఈ మూడు రంగాలకు ఏమాత్రం చోటు లేకుండా సినిమా రంగానికి మాత్రమే స్థానం కల్పించాను అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.