కొత్త సంవత్సరం రావడంతో సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు పెద్ద ఎత్తున కొత్త సంవత్సర వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ముఖ్యంగా సెలబ్రిటీలు పలు ప్రాంతాలకు వెళ్లి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.
అదేవిధంగా సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ ఎంతో ఘనంగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు.ఇకపోతే బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి యాంకర్ లాస్య సైతం న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ప్రస్తుతం లాస్య ప్రెగ్నెంట్ కావడంతో ఈమె ఇంటిలోనే తన భర్త మంజునాథతో కలిసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక లాస్య ప్రెగ్నెంట్ అని గత కొద్ది నెలల క్రితం ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.అయితే ప్రస్తుతం ఈమెకు నెలలు నిండడంతో తన బేబీ బంప్ చాలా క్లియర్ గా కనపడుతుంది.

ఇలా తన భర్తతో కలిసి రొమాంటిక్ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన లాస్య ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఈమె న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు.ఇక అభిమానులు కూడా లాస్యకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.కొత్త సంవత్సరంలో లాస్య ఇంటిలోకి మరో చిన్నారి రాబోతోందని తెలుస్తోంది.ఇప్పటికే ఈ దంపతులకు జున్ను అనే కుమారుడు ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇక లాస్య రెండో బిడ్డను కూడా ప్లాన్ చేసుకున్నారు.
వివాహం తర్వాత లాస్య బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనప్పటికీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ అభిమానులను సందడి చేస్తున్నారు.ప్రస్తుతం ఈమె బేబీ బంప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.







