మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి ఉపాసన రాంచరణ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
ముఖ్యంగా ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి ఈయన మాట్లాడారు.
ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ… ఉపాసన తాను తల్లి కాబోతున్నానని చెప్పగానే ఆ విషయం విన్న నేను సురేఖ చాలా సంతోషించాము ఈ శుభవార్త తెలియగానే కన్నీళ్లు ఆగలేదని చిరంజీవి తెలిపారు.
గత ఆరు సంవత్సరాల నుంచి మేము ఈ శుభవార్త కోసం ఎదురుచూస్తున్నాము.అందుకే ఉపాసన రాంచరణ్ ఈ విషయం చెప్పగానే కన్నీళ్లు వచ్చాయని చిరంజీవి తెలిపారు.ఇక రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు కూడా జపాన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మాకు ఈ విషయాన్ని తెలియజేశారని చిరంజీవి తెలిపారు.

ఇలా ఉపాసన మాకు మొదట్లో చెప్పినప్పటికీ మేము మూడవ నెల పూర్తి అయ్యేవరకు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా చిరంజీవి ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మెగా కుటుంబంతో పాటు ఈ శుభవార్త కోసం మెగా అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.మరో కొద్ది నెలలలో మెగా కాంపౌండ్ లోకి బుల్లి వారసుడు అడుగుపెట్టబోతున్నాడని మెగా ఫ్యామిలీతో పాటు, అభిమానులు కూడా ఎంతో సంతోషం చేస్తున్నారు.







