రాజకీయాల్లో ఇదంతా మామూలే

నాయకులు ఒకరిని ఒకరు తిట్టుకోవడం , అనరాని మాటలు అనుకోవడం రాజకీయాల్లో సాధారణమే.మామూలు రోజుల్లోనే తిట్టుకునే నాయకులు ఎన్నికల్లో పొట్టు పొట్టుగా తిట్టుకోవడంలో ఆశ్చర్యం ఏముంది? తిట్టుకోవడం కూడా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడం కిందకే వస్తుంది.

ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకుంటారు.

కాని ఏమవుతుంది? ఏమీ కాదు.ఇవి పెట్టీ కేసులు.

కాబట్టి పట్టించుకోరు.ఎన్నికలు జరగబోతున్న బీహార్లో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ , భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఒకరినొకరు తిట్టుకున్నారు.

నువ్వు నర భక్షకుడివి అని అమిత్ షాను లాలూ తిట్టాడు.నువ్వు గజ దొంగవు అని లాలూను అమిత్ తిట్టాడు.

Advertisement

ఇద్దరి మీద పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి.ఈ నాయకులు ఎన్నికల నిబంధనలు ఖాతరు చేయలేదని ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది.

ఈ ఇద్దరు నాయకుల మీద వివిధ సెక్షన్ల కింద కేసులు బుక్ చేసినట్లు పోలీసు అధికారులు చెప్పారు.ఎన్నికలు ముగిసే సమయానికి అనేకమంది నాయకుల మీద కేసులు బుక్ అవుతూనే ఉంటాయి.

కుల రాజకీయాలకు, గూండాగిరికి పేరు పొందిన బీహార్లో కేసులకు ఎవ్వరూ భయపడరు.పెద్ద అధికార్లను కూడా లేపేసిన చరిత్ర బీహార్ నాయకులకు ఉంది.

అక్కడ ఇదంతా మామూలే.

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?
Advertisement

తాజా వార్తలు