బెండ సాగులో కలుపు నిర్మూలన.. మేలైన ఎరువుల యాజమాన్యం..!

కూరగాయల ధరలలో హెచ్చుతగ్గులున్నా.స్థిరమైన ఆదాయాన్నిచ్చే పంటగా బెండ సాగు ( Ladys Finger Cultivation )రైతుల ఆదరణ పొందుతోంది.

బెండ సాగులో కలుపు నిర్మూలనతోపాటు మేలైన ఎరువుల( Fertilizers )కు అధిక ప్రాధాన్యం ఇచ్చి, ఎప్పటికప్పుడు చీడపీడలను గమనిస్తూ సకాలంలో సస్యరక్షణ చర్యలు పాటిస్తే బెండలో ఒక ఎకరాకు దాదాపుగా 10 టన్నుల దిగుబడి సాధించవచ్చు.మార్కెట్లో దొరికే తెగులు నిరోధక కంపెనీ సర్టిఫైడ్ విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.ఒక ఎకరాకు 2.5 కిలోల విత్తనాలు అవసరం.ఈ విత్తనాలకు ముందుగా ఐదు గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ కలిపి నాలుగు గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పట్టించి విత్తన శుద్ధి చేయాలి.

విత్తుకునే ముందు ఒక ఎకరం భూమిలో 25 కిలోల భాస్వరం, 25 కిలోల పోటాష్, 15 కిలోల నత్రజని ఎరువులు వేయాలి.మొక్కల మధ్య ఐదు సెంటీమీటర్లు, వరుసల మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.

విత్తిన వెంటనే కలుపు నివారణకు ఒక ఎకరాకు ఒకటి పాయింట్ రెండు లీటర్ల పెండి మిథాలిన్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.ఇలా చేస్తే దాదాపుగా కలుపు సమస్య ఉండదు.ఇక ఐదు రోజుల తర్వాత నీటి తడిని అందించాలి.

Advertisement

అనంతరం 10 రోజులకు ఒకసారి నీటి తడులు అందిస్తే 30 రోజుల నుంచి పూత రావడం ప్రారంభం అవుతుంది.

ఈ సమయంలో 15 కిలోల నత్రజనిని యూరియా రూపంలో అందిస్తే కాపు బాగుంటుంది.మళ్లీ 15 కిలోల నత్రజనిని విత్తిన 45 రోజులకు మరోసారి అందించాలి.బెండ పంట పూత దశలో ఉన్నప్పుడు 10 గ్రాముల యూరియాను ఒక లీటర్ నీటిలో కలిపి పంటపై పిచికారి చేస్తే దాదాపుగా 25 శాతం నత్రజని ఆదా అవుతుంది.

పైగా దిగుబడి కూడా పెరుగుతుంది.ఇక బెండ పంటను ఏవైనా చీడపీడలు ఆశించాయా.ఏవైనా తెగులు ఆశించాయా అని ఎప్పటికప్పుడు గమనిస్తూ తొలిదశలోనే అరికట్టే ప్రయత్నం చేయాలి.

ఈ పంట కాలం మూడు నెలలే కానీ మెరుగైన యాజమాన్య పద్ధతులు ( Proprietary methods )పాటిస్తే నాలుగు నుంచి ఐదు నెలల వరకు పంట కాలం పొడిగించబడి అధిక దిగుబడి పొందవచ్చు.

పట్టపగలు జలపాతం ఒడ్డున దెయ్యాలు ప్రత్యక్షం.. వీడియో చూస్తే జడుసుకుంటున్నారు..
Advertisement

తాజా వార్తలు