7/G బృందావన్ కాలనీ సినిమాను తలపించిన కుర్రాడు

తెలుగులో వచ్చిన 7/G బృందావన్ కాలనీ సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది.అప్పట్లో యూత్‌ను బాగా ఆకట్టుకున్న ఈ సినిమాలోని ఓ సీన్‌ను కొంచెం మార్చి నిజజీవితంలో చూపించాడు ఓ కుర్రాడు.

 Lady Gets Forcibly Married By Young Man In Tamil Nadu-TeluguStop.com

బస్సులో వెళుతున్న ఓ యువతి మెడలో బలవంతంగా తాళి కట్టాడు ఓ ప్రబుద్ధుడు.ఈ ఘటన తమిళనాడు సంచలనంగా మారింది.

తమిళనాడులోని సాండ్రోర్ కుప్పంలో ఈ ఘటన చోటు చేసుకుంది.అంబూరు గ్రామానికి చెందిన ఓ యువతి చదువు కోసం ప్రతిరోజు వాణియంబాడికి బస్సులో వెళ్లి వచ్చేది.సాండ్రోర్ గ్రామానికి చెందిన జగన్ అనే కుర్రాడు ఆమెను గొతకొంతకాలంగా ప్రేమిస్తున్నాడు.అయితే ఆమెకు నిశ్చితార్థం జరిగిన విషయం తెలుసుకున్న జగన్, ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని అనుకున్నాడు.

దీంతో ఆమె బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమె మెడలో బలవంతంగా తాళి కట్టాడు.దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా అవాక్కయ్యారు.యువతి కేకలు వేయడంతో ప్రయాణికులందరూ అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube