పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మోదీకి కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు.కేంద్రం నిర్లక్ష్యం వలన పోలవరం అనాథగా మారిందన్నారు.
నిధుల కేటాయింపులో విఫలం కావడంతో 300 టీఎంసీల నీరు సముద్రంలో వృథాగా కలిసిపోయిందని తెలిపారు.విభజన చట్టం ప్రకారం 2018లోనే ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు.
పోలవరం ఎత్తు తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలిసిందని లేఖలో పేర్కొన్నారు.కానీ డ్యామ్ ఎత్తు తగ్గితే ప్రాజెక్ట్ ప్రయోజనాలు అందవన్నారు.
నిర్వాసితులకు పరిహారం చెల్లించే స్థితిలో ఏపీ లేదని కేవీపీ రామచంద్రరావు వెల్లడించారు.